5 టు 95 | Anand Mahindra shares video that shows how a girl ages | Sakshi
Sakshi News home page

5 టు 95

Apr 30 2023 4:27 AM | Updated on Apr 30 2023 4:27 AM

Anand Mahindra shares video that shows how a girl ages - Sakshi

మానవ పరిణామక్రమం లాగే మనిషి వయసుకు సంబంధించిన రూప పరిణామక్రమం కూడా ఆసక్తికరమే. అయిదు సంవత్సరాల వయసు ఉన్న బాలిక 95 ఏళ్ల వృద్ధురాలు అయ్యేక్రమంలో ఎన్ని రూపాల్లో కనిపిస్తుందో చూపే ఈ వీడియో  వైరల్‌ అవుతోంది. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఈ హైపర్‌ రియలిస్టిక్‌ ఏఐ జనరేటెడ్‌ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే 1.8 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

బోలెడు లైక్‌లు వచ్చాయి. ‘మా అమ్మ వయసు 72 సంవత్సరాలు. ఆమె పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫొటో మా ఇంట్లో ఉంది. ఆ ఫొటోను, అమ్మను చూసినప్పుడల్లా ఈ ఇద్దరూ  నిజంగా ఒకరేనా? లేకపోతే వయసు ఆధారంగా కొత్త వ్యక్తులు ఆ వ్యక్తిలోకి వస్తుంటారా!’ అనే ధర్మసందేహాన్ని వెలిబుచ్చాడు ఒక నెటిజనుడు. ఈ సందేహం మాట ఎలా ఉన్నా ‘ఈ హైపర్‌ రియాలిటీ ఏఐ టెక్నాలజీతో 95 ఏళ్ల వయసులో నేను ఎలా ఉంటానో చూసుకోవాలని ఉంది’ అని సందడి చేస్తున్న నెటిజనుల సంఖ్యే ఎక్కువ.

Advertisement
 
Advertisement
Advertisement