వద్దిక... ఓవర్‌ ఒద్దిక బెటర్‌! | Amitabh Bachchan wins over the internet as he calmly deals with overconfident child on KBC 17 | Sakshi
Sakshi News home page

వద్దిక... ఓవర్‌ ఒద్దిక బెటర్‌!

Oct 15 2025 12:06 AM | Updated on Oct 15 2025 12:06 AM

Amitabh Bachchan wins over the internet as he calmly deals with overconfident child on KBC 17

పేరెంటింగ్‌పై చర్చ

ఇది వైరల్‌ కాలం! సర్వైలెన్స్‌ కెమెరాల మధ్య బిగ్‌ బాస్‌ హౌస్‌ ఉన్నట్టే జెన్‌ ఆల్ఫా కూడా తమను సోషల్‌ మీడియా ఫ్రేమ్‌లో ఫిక్స్‌ చేసుకుంది! అందుకే వాళ్లు ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను, వాళ్లు చూస్తున్న రీల్స్, షాట్స్, షోస్‌లోని క్యారెక్టర్స్‌ను అనుకరిస్తుంటారు. ఈ తీరు కొందరికి అతిగా... అసహజంగా అమర్యాదగా తోచవచ్చు. ఇంకొందరికి ముచ్చటగా అనిపించవచ్చు. ఈ రెండిటికీ ఉదాహరణగా ఇటీవల వైరల్‌ అయిన కౌన్‌ బనేగా కరోడ్‌పతి 17 వ సీజన్‌ ‘కేబీసీ జూనియర్స్‌’ లో ఓ చిన్నారి పార్టిసిపెంట్‌ వీడియోను చూపిస్తున్నారు. దీనిపై కామెంట్లు, కాంప్లిమెంట్లను పక్కన పెడితే ఈ వీడియో.. జెన్‌ ఆల్ఫా పేరెంటింగ్‌ కి సంబంధించి ఓ చర్చను లేవనెత్తింది...

కేబీసీలో ఇదీ జరిగింది.. 
కౌన్‌ బనేగా కరోడ్‌పతి17వ సీజన్‌లోని ‘కేబీసీ జూనియర్స్‌’ హాట్‌ సీట్‌లో ఓ బుడతడు కూచున్నాడు. చుట్టూ కెమెరాలు.. ఆడియెన్స్‌.. ఎదురుగా 83 ఏళ్ల పాపులర్‌ పర్సనాలిటీ.. ఎవర్‌గ్రీన్‌ సెలబ్రిటీ అమితాబ్‌ బచ్చన్‌.. అయినా ఎలాంటి బెరుకు లేకుండా చాలా రిలాక్స్‌డ్‌గా.. ఇంకా చె ప్పాలంటే ఆ కూర్చోవడంలోనే అందరి అటెన్షన్‌ను గ్రాబ్‌ చేశాడా పిల్లాడు. వాడి ఆత్మవిశ్వాసానికి ముచ్చటపడుతూ అమితాబ్‌ ‘హాట్‌ సీట్‌లో కూర్చోవడం ఎలా ఉంది?’ అనడిగారు. ‘ఎక్సయిటెడ్‌గా ఉన్నాను కానీ.. మీరు రూల్స్‌ చెబుతూ కూర్చోకండి.. నాకు ఈ షో రూల్స్‌ అన్నీ తెలుసు.. నేరుగా పాయింట్‌కి వచ్చేద్దాం’ అన్నాడు.

ఆ జవాబు హోస్ట్‌ అయిన అమితాబ్‌ను ఖంగుతినేలా చేసింది. అయినా తమాయించుకుని షోని ప్రోసీడ్‌ చేశాడు. మొదటి ప్రశ్న అడిగి ఆప్షన్స్‌ ఇచ్చేలోపే జవాబు చెప్పి ఆప్షన్స్‌ లేకుండానే నా ఆన్సర్‌ని లాక్‌ చేసేయ్‌ డాన్స్‌.. ఆప్షన్‌ ఏదైనా ఈ ఆన్సర్‌ లాక్‌ చేసెయ్‌’ అన్నాడు అమర్యాదగా. ఆ తర్వాత ప్రశ్న అడిగేముందు ఏదో చెప్పబోతున్న అమితాబ్‌ను‘మీరు ప్రశ్నయితే అడగండి ముందు’ అన్నాడు అదే ధోరణిని కొనసాగిస్తూ. అదే ప్రవర్తనతో ఆ పిల్లాడు అలా అయిదవ ప్రశ్న దాకా వచ్చాడు.

25 వేలు వచ్చే అయిదవ ప్రశ్న ‘వాల్మీకి రామాయణంలోని మొదటి కాండ ఏది?’ కి ఆప్షన్స్‌ అడిగాడు ఆ కుర్రాడు.‘బాల కాండ.. అయోధ్య కాండ.. కిష్కింధ కాండ.. యుద్ధ కాండ’ అంటూ నాలుగు ఆప్షన్స్‌ను చదివారు అమితాబ్‌. వెంటనే ‘బి.. అయోధ్యకాండ’ అని చెబుతూ ‘ఒక్కసారి కాదు ఈ ఆన్సర్‌ను నాలుగుసార్లు లాక్‌ చేయండి’ అన్నాడు పిల్లాడు. ‘సారీ.. తప్పు చె ప్పావ్‌.. కరెక్ట్‌ ఆన్సర్‌ బాలకాండ’ అన్నారు అమితాబ్‌. ఈసారి ఆ పిల్లాడు ఖంగు తిన్నాడు. 

ఆ బాబు వయసు పదేళ్లు. అయిదవ తరగతి చదువుతున్నాడు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉంటాడు. ఆ పిల్లాడు జవాబులు చెబుతూంటే ఆడియెన్స్‌ గ్యాలరీలో ఉన్న అతని తల్లిదండ్రులు కొడుకువైపు మురిపెంగా.. గర్వంగా చూడసాగారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్లు సోషల్‌ మీడియాలో రెండురకాలుగా స్పందించారు. కొందరు ‘జ్ఞానం ఒక్కటే ఉంటే సరి పోదు.. కాసింత వినయం, సంస్కారం కూడా ఉండాలి’,‘అది కాన్ఫిడెన్స్‌ కాదు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. ’, ‘చదువు కన్నా ముందు పిల్లలకు మర్యాద, మన్నన నేర్పాలి’, ‘అమ్మో... పిల్లాడు కాదు... మహా ముదురు’ అంటూ, ఇంకొందరు ‘అయిదు నిమిషాల ఫుటేజ్‌ చూసి పిల్లాడి బిహేవియర్‌ని జడ్జ్‌ చేయడమేంటీ?’, ‘పేరెంట్స్‌ పిల్లాడికి కాస్త మర్యాదగా నడుచుకోమని చెప్పి ఉంటే బాగుండేది’ అంటూ కామెంట్‌ చేశారు.

బ్రేక్‌ పడాల్సిన ప్లేస్‌ ఇల్లు...
‘ఇలాంటి ప్రవర్తన ఉన్న ట్రెండ్‌ను 6 –13 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తాం. ఇది బుద్ధిమాంద్యం లేదా ఏడీహెచ్‌డీ ఏమాత్రం కాదు. డిఫరెంట్‌గా కనిపించాలనే తాపత్రయం, పదిమంది దృష్టిని ఆకర్షించాలన్న లక్ష్యం. ఒక్కమాటలో చె ప్పాలంటే డిఫరెంట్‌ బిహేవియర్‌తో సోషల్‌ మీడియా అటెన్షన్‌ను గ్రాబ్‌ చేయడమన్న మాట. దీనికి ఇండివిడ్యువలిస్ట్‌గా పెరగడం, ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. ఓవర్‌ ఆటిట్యూడ్‌ బిహేవియర్‌ కారణం. వాళ్లు సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్, రీల్స్, షాట్స్‌ లోని క్యారెక్టర్లను అనుకరిస్తూ తమ సహజత్వాన్ని మరచి పోతారు. ఆ ప్రభావంతో అందరూ గౌరవిస్తున్న వాళ్ల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటారు.

అందులో భాగమే పెద్దవాళ్లను ఏకవచనంతో సంబోధించడం, అన్నీ తమకే తెలుసన్నట్లుండటం, వయసుకు మించి మాట్లాడటం లాంటివి. ఇలాంటి పిల్లల ప్రవర్తనను చక్కదిద్దక పోగా దాన్ని వాకి తెలివితేటలుగా అభివర్ణిస్తూ ప్రోత్సహిస్తుంటే ఇదిగో ఇలాగే ఓవర్‌ కాన్ఫిడెంట్‌గా తయారవుతారు. ఈ తీరును మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. దీనికి బ్రేక్‌ పడాల్సిన ప్లేస్‌ ఇల్లు.. బ్రేక్‌ వేసి ఆ ప్రవర్తనను సరిచేయాల్సిన వాళ్లు తల్లిదండ్రులే. – డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి కన్సల్టెంట్‌ చైల్డ్‌ అండ్‌ అడల్ట్‌ సైకియాట్రిస్ట్, హైదరాబాద్‌

ఆ ట్రైనింగ్‌ పేరెంట్సే ఇవ్వాలి...
‘ఆ బుడతడి వీడియో చాలా వైరల్‌ అయింది. వైరల్‌ అయిన వీడియో కూడా జస్ట్‌ ఒక టూ త్రీ మినిట్స్‌ క్లిప్పింగ్‌ అంతే! దాన్నిబట్టే ఆ పిల్లాడి ప్రవర్తనను, పేరెంటింగ్‌ను జడ్జ్‌ చేయడం కరెక్ట్‌ కాదని నా ఉద్దేశం. ట్రోల్‌ చేయడం కూడా తప్పే. అది పిల్లాడి మీద, అతని తల్లిదండ్రుల మీదా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే.. ఆ పిల్లాడిలో ఇంపల్సివిటీ కనిపిస్తోంది. దాన్ని కంట్రోల్‌ చేసుకోవాలి. ఆ ట్రైనింగ్‌ పేరెంట్సే ఇవ్వాలి.    – వర్ష వేముల, సైకోథెరపిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement