పండగొస్తోంది...మిక్సర్‌ గ్రైండర్‌ క్లీనింగ్‌ టిప్స్‌ : కొత్తగా మెరుస్తుంది | Sakshi
Sakshi News home page

పండగొస్తోంది...మిక్సర్‌ గ్రైండర్‌ క్లీనింగ్‌ టిప్స్‌ : కొత్తగా మెరుస్తుంది

Published Thu, Apr 4 2024 6:17 PM

Amazing tips to clean the mixer grinder and shine like new - Sakshi

పూర్వకాలంలాగా రోళ్లు, కలం,  తిరగళ్లు ఇపుడు  పెద్దగా వాడటం లేదు.  అవి ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో కూడా  ఈ తరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు.  ఇపుడంతా మిక్సీలు, గ్రైండర్లు మయమే. అటు ఉగాది పండుగ సమీపిస్తోంది. ఉగాది నుంచి  వరుసగా పండుగలు షురూ అవుతాయి.  చుట్టాలు, పక్కాలు.. కొత్త అల్లుళ్లు.. హితులు..స్నేహితులు ..ఈ సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో మన వంట ఇంటిలో అన్నీ సవ్యంగా ఉన్నాయో  లేదో చెక్‌ చేసుకోవాలి.

ముఖ్యంగా మిక్సీ గ్రైండర్‌. మిక్సర్ గ్రైండర్‌ లేకుండా వంటను ఊహించుకోవాలంటేనే కష్టం. ఒక్కోసారి జార్స్‌ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరిగ్గా పని ఉన్నపుడో, చుట్టాలొచ్చినపుడో పని చేయనని మొరాయిస్తుంటాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. 

సాధారణంగా పచ్చళ్లు, రకరకాల పొడులు,  పొడులు, అల్లం వెల్లుల్లి, ఇతర పేస్ట్‌లు చేసేందుకు మిక్సీ గ్రైండర్ వాడతాం. వాడిన తరువాత ఎప్పటికపుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి. గాస్కట్‌ (జార్‌ మూత చుట్టూ  ఉండే రబ్బరు) బ్లేడ్లు కూడా తీసి శుభ్రం చేసుకోవాలి.  లేదంటే మిక్సీజార్‌తో పని ఎంత సులువో, అది మొరాయిస్తే అంత కష్టం. ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంచుకుంటేనే, ఎలక్ట్రానిక్‌ వస్తువులు  ఏవైనా ఎక్కువరోజులు మన్నుతాయి.

మిక్సీని, జార్స్‌ని ఎలా క్లీన్ చేయాలి?
వంటసోడా: మురికి పట్టి, మొరాయించిన మిక్సీ జార్‌ సరిగ్గా పనిచేయాలంటే.. బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్‌లో కొద్దిగా వేడి నీరు పోసి పేస్టులా చేయండి. దీంతో జార్స్‌ని అప్లై చేసి, కొద్దిగా జార్‌లో వేసిన రెండు సార్లు తిప్పాలి. ఈ తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి.

వెనిగర్: వెనిగర్, నీళ్లు కలిపి జార్స్‌లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఒక్కసారి మిక్సీ వేయండి. తరువాత నీటితో క్లీన్ చేస్తే  బ్లేడ్లు, జార్‌ మొత్తం శుభ్రంగా తయారవుతుంది. పిండి ,  జార్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది.

నిమ్మ తొక్కలు: నిమ్మ తొక్కలతో కూడా జార్స్‌ని చక్కగా క్లీన్ చేయొచ్చు. నిమ్మతొక్కలు, కొద్దిగా లిక్విడ్‌ డిటర్జెంట్ కొద్దిగా నీరు వేసి మిక్సీని ఆన్ చేయండి.  ఒకటి రెండు నిమిషాలు తిప్పండి. అలాగే మిక్సీని మొత్తాన్నికూడా జాగ్రత్తగా మెత్తని క్లాత్‌తోగానీ, స్పాంజితో గానీ క్లీన్‌ చేసుకుంటే.. చక్కగా  కొత్తదానిలా మెరిపోతుంది.

నోట్‌ : మిక్సీని క్లీన్‌ చేసేటపుడు బ్లేడుల కారణంగా మన చేతి వేళ్లు తెగకుండా  జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మిక్సీ మోటర్‌లోకి అస్సలు వాటర్‌ పోకూడదు.  ఒక్క చుక్క నీరు పోయినా  మోటర్‌ పాడయ్యే అవకాశం ఉంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement