సంప్రదాయ వేపుడు వంటకాలకు.. ఎయిర్‌ డీప్‌ ఫ్రైయర్‌

Air deep fryer for traditional frying dishes - Sakshi

ఎలక్ట్రిక్‌ హాట్‌ వోక్‌
హైక్వాలిటీ బ్రష్డ్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఈ ఎలక్ట్రిక్‌ హాట్‌ వోక్‌.. చకచకా రకరకాల రుచులను వండిపెడుతుంది. లీటరు సామర్థ్యం గల ఈ డివైజ్‌లో ఐదు లేదా ఆరుగురికి సరిపడే వంటకాలను తయారుచేసుకోవచ్చు. నూడుల్స్, రైస్‌ ఐటమ్స్, వెజిటబుల్‌ సూప్స్‌ వంటి వెరైటీలతో పాటు చికెన్, మటన్, ఫిష్‌ వంటి నాన్‌వెజ్‌ ఐటమ్స్‌నూ నిమిషాల్లో గ్రిల్‌ చేసుకోవచ్చు.

దీని కుడివైపు కిందభాగంలో పవర్‌ కనెక్ట్‌ చేసుకునే వీలుంటుంది. దీనికి సరిపడా ప్రత్యేకమైన మూత, గరిటె మెషిన్‌తో పాటు లభిస్తాయి. టెంపరేచర్‌ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అవసరమయ్యే రెగ్యులేటర్‌ పవర్‌ కనెక్టర్‌ పైభాగంలోనే ఉంటుంది. వేరియబుల్‌ టెంపరేచర్‌ సిస్టమ్‌ కలిగిన ఈ డివైజ్‌.. మొత్తం పది సెట్టింగ్స్‌ చేసుకునే వీలుంటుంది. సర్వ్‌ చేసుకునేందుకు వీలుగా ఇరువైపులా ప్రత్యేకమైన హ్యాండిల్స్‌ ఉంటాయి. 
క్వైట్‌ ప్రొఫెషనల్‌ బ్లెండర్‌
ఇడ్లీ పిండి, గారెల పిండి, బియ్యం నూక, పీనట్‌ బటర్, చట్నీలు, జ్యూసులు.. ఇలా ఏది తయారు చేసుకోవాలన్నా వంటగదిలో ముఖ్యంగా ఉండాల్సిన యంత్రాలు మిక్సీ, గ్రైండర్‌. స్మార్ట్‌ టచ్‌ వేరియబుల్‌ స్పీడ్, స్టెయిన్లెస్‌ స్టీల్‌ బ్లేడ్స్‌.. వంటి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ ప్రొఫెషనల్‌ బ్లెండర్‌ మల్టీపర్పస్‌గా ఉపయోగపడుతుంది.

జ్యూసర్, నట్‌ బటర్‌ మేకర్, మిక్సర్, గ్రైండర్‌.. ఇలా పలువిధాలుగా పని చేస్తుంది. పండ్లు, కూరగాయల జ్యూస్‌లను చేస్తుంది. గింజలను మెత్తటి పిండిలా అందిస్తుంది. ఇందులో 10 స్పీడ్‌ సెట్టింగ్స్‌తో పాటు.. స్మూతింగ్, క్రషింగ్, క్లీనింగ్‌ అనే పలు సెట్టింగ్స్‌ ఉంటాయి. సాధారణంగా మిక్సీ, గ్రైండర్‌ వంటివి ఉపయోగించేటప్పుడు బర్‌ బర్‌మనే పెద్ద శబ్దం రావడం తెలిసిందే. కానీ ఈ డివైజ్‌ సౌండే లేకుండా సైలెంట్‌గా పనిచేసి పెడుతుంది. అందుకు వీలుగా డివైజ్‌కి అమర్చిన షీల్డ్‌ను.. పైనుంచి కిందకి క్లోజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. భలే బాగుంది కదూ. 

డీప్‌ ఫ్రైయర్‌
సంప్రదాయ వేపుడు వంటకాలకు.. ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం ఈ ఎయిర్‌ డీప్‌ ఫ్రైయర్‌. ఇది తక్కువ నూనెతో ఎక్కువ రుచులను అందిస్తుంది. అడ్జెస్టబుల్‌ థర్మోస్టాట్‌ పర్మిట్స్‌ కలిగిన ఈ డివైజ్‌ ఒకటిన్నర లీటర్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో వెజ్, చిప్స్, ఫ్రై, డీప్‌ ఫ్రై వంటి వెరైటీలతో పాటు మటన్, ఫిష్‌ వంటి నాన్‌ వెజ్‌ రుచులు, హోల్‌ చికెన్‌ వంటి పెద్దపెద్ద ఐటమ్స్‌ చాలానే తయారు చేసుకోవచ్చు.

దీన్ని సులభంగా లాక్‌ చేసుకోవచ్చు. హ్యాండిల్‌పై బటన్‌ నొక్కి పైకి లాగి..ఆ తర్వాత మూత ఓపెన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. కుడివైపు రెగ్యులేటర్‌ సాయంతో కావాల్సిన విధంగా టెంపరేచర్‌ సెట్‌ చేసుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top