అనార్కలీ డ్రస్‌లో అదిరిపోతున్న అదితి రావ్‌..ధర తెలిస్తే షాకవ్వుతారు!

Aditi Rao Hydari Radiates Elegance And Grace In Anarkali - Sakshi

సింప్లిసిటే తన స్టయిల్‌ సిగ్నేచరేమో అన్నట్టు ఉంటుంది అదితి రావ్‌ హైదరీ. ట్రెడిషనల్‌.. వెస్టర్న్‌ ఏ వేర్‌ అయినా ఆమె అందాన్ని పెంచడం కాదు.. ఆమే ఆ కాస్ట్యూమ్స్‌కు కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది! అదీ అదితి ఫ్యాషన్‌ను క్యారీ చేసే పద్ధతి. ఆ అదృష్టాన్ని వరించిన బ్రాండ్స్‌లో ఒకట్రెండు ఇక్కడ.. 

ఢిల్లీ వింటేజ్‌ కో 
మనీష్‌ ఛాబ్డాను ప్రముఖ డిజైనర్‌ అనేకంటే  సంప్రదాయ చేనేత పరిరక్షకుడు అనొచ్చేమో! ‘ఢిల్లీ వింటేజ్‌ కో’ బ్రాండ్‌ను ప్రారంభించి.. గత 23 ఏళ్లుగా దేశీ నేత కార్మికులతో పనిచేస్తూ అద్భుతమైన డిజైన్స్‌ను సృష్టిస్తున్నాడు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. అదితి ధరించే ఢిల్లీ వింటేజ్‌ కో బ్రాండ్‌ డ్రస్‌ ధర రూ.1,22,000/-

సిల్వర్‌ స్టీక్‌ స్టోర్‌
గోల్డ్‌ కోటెడ్‌ సిల్వర్‌ జ్యూలరీ.. ఈ బ్రాండ్‌ బాణి. ఇండియన్‌ సెలబ్రిటీలకు హాట్‌ ఫేవరేట్‌ ఇది. ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాలి. ఇంకా ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ఓపెన్‌ కాలేదు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. నా దృష్టిలో డ్రెస్‌కి ఫిట్టింగ్‌ అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాతే ఫ్యాబ్రిక్‌.. డిజైన్‌.. స్టయిల్‌ ఎట్‌సెట్రా! డ్రెస్‌ కంఫర్ట్‌గా ఉంటే అందం ఆటోమేటిగ్గా ఫిక్స్‌ అవుతుంది! 

అపరాజితా తూర్‌
టాప్‌ మోస్ట్‌ లగ్జూరియస్‌ ఫ్యాషన్‌ ఫుట్‌వేర్‌ బ్రాండ్స్‌లో అపరాజితా తూర్‌ ఫుట్‌వేర్‌ ఒకటి. ముంబైలో మెయిన్‌ ఆఫీస్‌ ఉంది. సంప్రదాయ అల్లికలు, కుందన్‌ వర్క్స్‌తో లభించే ఈ జూతీస్‌కి  ఇండియాలో మంచి గిరాకీ ఉంది. క్యాజువల్‌ ఫుట్‌వేర్‌ క్కూడా అందాన్ని అద్దడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. అందుకే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్‌ అంటే తీరని మోజు. ధర కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. అదితి రావ్‌ ధరించిన ఫుట్‌ వేర్‌ బ్రాండ్‌ ధర రూ. 6,399/-.

(చదవండి:  'నా సామిరంగ’ మూవీ హీరోయిన్‌ చుడిదార్‌లో లుక్‌ మాములుగా లేదుగా!)

 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top