
చేనేత, హస్తకళలు.. వీటి కొనసాగింపులో ఆధునిక ఫ్యాషన్, టెక్నాలజీ వంటి అంశాలతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమ నిర్వహణకు కేంద్ర టెక్స్‌టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్‌ష్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ శాఖ భాగస్వామ్యంతో ‘ఛాప్’ నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పారామం వేదికగా ఈ నెల 12 నుంచి 17 వరకూ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతినిధులు నిఫ్ట్ వేదికగా మంగళవారం వెల్లడించారు.
ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా భిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శిల్పారామం వేదికగా నిర్వహించే స్టాల్స్‌లో హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలోని టూరిజం డెస్టినేషన్ ప్రాధాన్యతను ప్రదర్శించి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని క్లస్టర్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్వ ఖురానా పేర్కొన్నారు.
ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు..
దేశవ్యాప్తంగా 19 నిఫ్ట్ క్యాంపస్‌లు ఉన్నాయని, హైదరాబాద్ క్యాంపస్ భాగస్వామ్యంతో ఈ ప్రదర్శనలో 60 క్రాఫ్టŠస్, 40 అలుమ్ని బృందాలు పాల్గొంటాయి. ఆరు రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా చేనేత, హస్త కళాకారుల ప్రదర్శనలతో పాటు ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు, 6 ప్రధాన క్రాఫ్ట్ ప్రదర్శనలు చేపట్టామని, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్స్ కూడా ప్రదర్శిస్తాం. తెలంగాణలోని తోలుబొమ్మలాట లాంటి అరుదైన కళల ప్రాధాన్యత తెలియజేసి, పలు అరుదైన కళలకు పేటెంట్స్, జీయో ట్యాగ్ ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కలి్పంచనున్నాం.
– డా.మాలిని, నిఫ్ట్ డైరెక్టర్
(చదవండి: సౌకర్యం + సంతోషం = కవాయి)