చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా.. | Sakshi
Sakshi News home page

Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..

Published Mon, Jan 30 2023 1:00 PM

12 Best Useful Skin And Hair Care Simple Tips - Sakshi

చర్మ, కేశ సంరక్షణకు ఉపయోగపడే సులువైన చిట్కాలు.. ఓ లుక్కేయండి మరి!
►చర్మం చిట్లి బిరుసెక్కినట్లుగా ఉంటే శరీరానికి పెరుగు రాసి, అరగంట ఆగి స్నానం చేయండి. ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
►చర్మం మీది ముడతలు పోవాలంటే కొద్ది రోజులపాటు ప్రతిరోజూ ఉదయం చేమంతి పూలతో సున్నితంగా మర్దన చేయాలి.

నిగనిగలాడే జుట్టు కోసం
►జుట్టు నిగనిగలాడుతూ మెరవాలంటే కోడిగుడ్డు సొనను, అరటి పండును బాగా కలిపి, ఆ పేస్టును తలకు పట్టించి పావుగంట తర్వాత మైల్ట్‌ షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి.
►జుట్టు బిరుసుగా ఉండి వెనకకు దువ్వడానికి వీలులేకుండా ఉంటే నీళ్ళలో కొంచం నిమ్మరసం కలిపి తలకి రాసి దువ్వండి.
►ఒక భాగం ఆపిల్‌ జ్యూస్, మూడు భాగాల నీరు కలిపి తలకి రాసి ఆరిన తరువాత తల స్నానం చేస్తే ఎరుపు రంగులోని జుట్టు నల్లగా మారడమే కాకుండా వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.

గులాబీ రంగు పెదాల కోసం
►పెదవులు తరచు ఎండిపోవడం లేదా పగలడం జరుగుతుంటే పాలమీగడను, కుంకుమ పువ్వును బాగా కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు పెదవులకు పూయాలి. ఈ విధంగా వారం పదిరోజులు చేస్తే మీ పెదవులు గులాబీ రంగులోకి మారి అందంగా ఉంటాయి.
►తేనె, నిమ్మరసం, గ్లిసరిన్‌లో కలిపి రాత్రిపూట పడుకోబోయే ముందు పెదాలకి రాసి మర్దన చేస్తే పెదాల నల్లదనం పోతుంది. గులాబీ రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి.
►పెదాలపైన మచ్చలు పోవాలంటే గ్లిసరిన్‌ లో కొంచం రోజ్‌ వాటర్‌ కలిపి దానిని పెదాలకు మర్దన చేయాలి.

పిల్లలకు
►పిల్లలకి స్నానం చేయించడానికి సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడితే చర్మవ్యాధులు రాకుండా వుండడమే కాకుండా, శరీరంమీద వుండే నూగులాంటి వెంట్రుకలు కూడా పోతాయి.
►ఎండబెట్టిన పుదీనా ఆకుల్ని పొడిచేసి, తగినంత నీరు కలిపి బాగా కాచి, చల్లార్చిన కషాయాన్ని ప్రతిరోజూ పుక్కిలి బడితే నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం కారటాన్ని నివారించవచ్చు.
చదవండి: Constipation: మలబద్ధకం నివారణ... మరికొన్ని ప్రయోజనాలు!! ఇవి తరచుగా తింటే.. 
Health Tips In Telugu: పిల్లలు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి?

Advertisement
 
Advertisement
 
Advertisement