ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! | From 101 Kg To 65 Kg fitness content creator Weight loss journey | Sakshi
Sakshi News home page

Weight loss Tips: ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! డైట్‌ ప్లాన్‌..

Jun 4 2026 4:42 PM | Updated on Jun 4 2026 5:21 PM

From 101 Kg To 65 Kg fitness content creator Weight loss journey

బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్‌నెస్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అధిక బరువు ఏ రేంజ్‌లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్‌ మాదిరి స్మార్ట్‌ లుక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఆ ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్‌. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్యుమెంట్‌ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. 

భోజన ప్రణాళిక..
తొలిరోజు..
ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్‌తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్‌  బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. 

మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.

రెండవ రోజు
రెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్‌తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. 

సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.

3వ రోజు
ఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. 

మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.

4వ రోజు
కాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్‌తో రెండు రైస్ కేక్‌లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.

5వ రోజు
ఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్‌నట్‌లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.

బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: 'సక్సెస్‌'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్‌ని..)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement