ఓటుకు వేళాయే | - | Sakshi
Sakshi News home page

ఓటుకు వేళాయే

Nov 26 2026 12:36 AM | Updated on Nov 26 2026 12:36 AM

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో తొలి విడత పంచాయతీలతో పాటు మొదటిసారిగా చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రధాన రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు, స్వతంత్రులు హోరాహోరీగా సార్వత్రిక ఎన్నికలు తలపించే రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి గురువారం ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు తొలి విడతలో జరిగే పంచాయతీల్లో పోలింగ్‌ కేంద్రాల నుంచి సిబ్బంది నియామకం అన్నింటిని పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమయ్యారు.

13 పంచాయతీలు ఏకగ్రీవం

తొలి విడతలో 177 పంచాయతీలకుగాను 13 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు, 324 వార్డు మెంబర్లు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 164 పంచాయతీల, 1567 వార్డు మెంబర్లకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించి 2 గంటలకు ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. పోలీస్‌ యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధానంగా 11 మండలాల్లో 68 రూట్లుగా విభజించి రూట్లవారీగా బందోబస్తును విధిలు కేటాయించారు.

బుధవారం చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. తొలి విడతలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి.నర్సాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో ఎన్నికలు ని ర్వహించడానికి వీలుగా సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తి చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియను సీసీ కెమెరాలతో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో జిల్లాలో 4,57,329 మంది ఓటర్లు 1,953 పోలింగ్‌కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అలాగే 1,037 మందికి ఎన్నికల విధులు కేటాయించారు.

చింతలపూడిలో ‘తొలి’ పోరు

మేజర్‌ పంచాయతీగా ఉన్న చింతలపూడి నగర పంచాయతీగా ఆవిర్భవించిన తర్వాత తొలి ఎన్నికలు కావడంతో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గురువారం జరిగే ఎన్నికల్లో 23 వార్డులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 22 వార్డుల్లో కౌన్సిలర్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. 22,738 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నేడే పోలింగ్‌

తొలి విడతలో 166 పంచాయతీలు

4.57 లక్షల మంది పల్లె ఓటర్లు

చింతలపూడి నగర పంచాయతీకి తొలి ఎన్నికలు

చైర్‌పర్సన్‌.. 22 వార్డు కౌన్సిలర్‌ పదవులకు పోలింగ్‌

పంచాయతీల్లో పోలింగ్‌ అనంతరం కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement