వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నాయకులు

Nov 26 2026 12:36 AM | Updated on Nov 26 2026 12:36 AM

నూజివీడు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పిలుపునిచ్చారు. మండలంలోని జంగంగూడేనికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 50 మంది మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు సమక్షంలో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మధ్య, పేద వర్గాలకు చెందిన ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. వంట నూనెలు, పప్పులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను చంద్ర బాబు మోసం చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పాలన అందాలన్నా అది కేవలం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. టీడీపీ నాయకులు చీకటి వెంకటరావు, ప్రత్తిపాటి రాజ్‌ కుమార్‌, ప్రత్తిపాటి కోటేశ్వరరావు, నందిపాము కుమారి, ఉయ్యూరు ఉషారాణి, తోమ్మండ్రు రాము తదితరులతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement