దాళ్వాకు విత్తన గండం | - | Sakshi
Sakshi News home page

దాళ్వాకు విత్తన గండం

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

దాళ్వాకు విత్తన గండం విత్తన కొరత ఉచితంగా అందించాలి

2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా

వరుస తుపాన్లతో సార్వా పంటతోపాటు దాళ్వా విత్తన అవసరాల కోసం నాట్లు వేసిన పంట కూడా పూర్తిగా దెబ్బతింది. ముందుగా మాసూళ్లు చేసిన రైతుల వద్ద విత్తనాలు సేకరిద్దామంటే మొలక ఎలా ఉంటుందోనని భయం. ఇతర రైతుల వద్ద కూడా తగినంత విత్తనం అందుబాటులో లేదు. అసలే సార్వా పంట దెబ్బతిన్న రైతులు దాళ్వా సాగు కోసం ఇప్పటినుంచే పాట్లు పడాల్సి వస్తోంది.

– పంజా చంటి, రైతు, ముగ్గుళ్లు, గణపవరం మండలం

సార్వా పంట పూర్తిగా దె బ్బతిన్న తరుణంలో ప్ర భుత్వం పంట నష్టపరిహారం అందించడంతోపాటు దాళ్వాకు అవసరమైన వరి విత్తనాలు కూడా ఉచితంగా అందజేయాలి. వరుస తుపాన్లు తీవ్రంగా దెబ్బతీయడంతో రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు విత్తనాలను బయట కొనుగోలుచేసే పరిస్థితిలో లేరు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవపోతే దాళ్వా సాగు కష్టమే.

– కడలి నర్సింహమూర్తి,

వనుంవారిపాలెం, అత్తిలి మండలం

భీమవరం : వరుస తుపాన్లతో వరి పంట దెబ్బతిన్న రైతులకు గోరుచుట్టుపై రోకలిపోటుగా దాళ్వాకు విత్తన కొరత వెంటాడుతోంది. దాళ్వా పంటకు అవసరమైన విత్తనాలను గతంలో ఎక్కువగా రైతులే సమకూర్చుకుంటుండంగా ప్రస్తుతం విత్తన రకాలు సైతం దెబ్బతినడంతో రైతులంతా ప్రభుత్వం అందించే విత్తనాలు కోసం ఎదురుచూస్తున్నారు. గత నెలాఖరున అర్నాబ్‌ తుపాను కారణంగా జిల్లాలో ఎక్కువ వరి పంట నెలకొరగగా ఈనెలలోని మురసు తుఫాన్‌ దాదాపు మొత్తం పంటను నీటి ముంచింది. అత్యంత భారీ వర్షం, డ్రెయినేజీలు సక్రమంగా లాగకపోవడంతో నేటికీ అనేక ప్రాంతాల్లోని వరి పంటలో నీటిలోనే తేలియాడుతోంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఈ ఏడాది సార్వా సీజన్‌లో దాదాపు 2.17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. నాట్లు ప్రారంభంలో సాగునీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం వరిపైరు ఏపుగా పెరుగుతున్న తరుణంలో చీడపీడలు, ఎలుకల బెడదతో పెట్టుపడి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. వ్యయప్రయాసల కోర్చి పైరును పెంచి పోషించగా పంట ఆశాజనకంగా ఉందనే సంతోషంలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, గణపవరం వంటి మండలాల పరిధిలో విత్తన రక్తం పంటను మా సూళ్లు చేపట్టారు.

1.82 లక్షల ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో 2.17 లక్షల ఎకరాల్లో సార్వా సాగు చే యగా వరుస తుపాన్ల కారణంగా 1.82 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. నేలకొరిగి నీట మునిగిన పంట పూర్తిగా కుళ్లిపోగా త్వరతగతిన నీరు లాగిన ప్రాంతాల్లో కొంతమేరకు పంట చేతికి వచ్చే అవకాశముంది. అయితే పంట నీటిలో తడిచి పోవడంతో రంగు మారి నాణ్యత దెబ్బతింటుందని దానితో పాటు దిగుబడి తగ్గిపోయి కనీసం మాసూళ్లు ఖర్చులు కూడా రైతుకు దక్కడం కష్టమేనంటున్నారు.

పెరిగిన ధరలు

దాళ్వా సీజన్‌లో రైతులు ఎక్కువగా ఎంటీయూ 1121 రకం నాట్లు వేసే అవకాశమున్నందున ఈ రకం విత్తనాలకు డిమాండ్‌ పెరిగింది. గతంలో 40 కిలోల విత్తనాలు సుమారు రూ.2 వేలకు విక్ర యాలు చేయగా ప్రస్తుతం రూ.3 వేలకు పైగా ధర పలుకుతోంది. అయితే విత్తనాలు కూడా సక్రమంగా ఆరుదల లేకపోవడంతో 40 కిలోల కొనుగోలు చేసి ఎండబెట్టిన తరువాత తూకం వేస్తే 36 కిలోలు మాత్రమే వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. సార్వా పంట దెబ్బతిన్న నేపద్యంలో రైతులంతా పూర్తిగా దాళ్వా పంటపై దృష్టిపెట్టడంతో ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. రైతులకు దాళ్వా విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విత్తు.. విపత్తు

జిల్లాలో 2.17 లక్షల ఎకరాల్లో సార్వా సాగు

తుపాన్ల వల్ల 1.82 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

రబీలో 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం

సుమారు 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం

మార్కెట్‌లో 40 కిలోలు రూ.3 వేలకు విక్రయం

ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌

జిల్లాలో సాగుచేసే 2.35 లక్షల ఎకరాల దాళ్వా పంటకు దాదాపు 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా. రానున్న సీజన్‌కు రైతులు ఎక్కువగా ఎంటీయూ 1121 వరి రకంతోపాటు ఎంటీయూ 1153,1156 వంటి రకాలను కూడా నాట్లు వేస్తారు. గతంలో దాళ్వాకు అవసరమైన వరి విత్తనాలను రైతులు ఎక్కువగా సార్వా సాగులో నాట్లు వేసి జాగ్రత్త చేసుకునేవారు. ఒక రైతు నుంచి మరొకరు విత్తనాలు సర్దుబాటు చేసుకుంటూ ప్రభుత్వం అందించే విత్తనాల కోసం ఎక్కువగా ఎదురుచూడాల్సిన అవసరం ఉండేదికాదు. ప్రస్తుతం దీనికి భిన్నంగా రైతులంతా ప్రభుత్వం అందించే విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. సార్వాలో సాగుచేసిన విత్తన రకాలు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లో కొంతమేరకు చేతికి వచ్చిన మిగిలిన ప్రాంతాలో వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్నాయి. అనేక చోట్ల చేలలోనే మెలకవచ్చాయి. దీంతో రైతుల నుంచి విత్తనం లభించే అవకాశం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement