● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు
● ౖచైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ముమ్మర ప్రచారం
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులదే విజయమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని కొప్పుల వెలమపేటలో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పెదగర్ల సునీత, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి డోకల ఉమాతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పెదగర్ల సునీతను గెలిపిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి న రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని, వాటిని గుర్తుచేసుకుని వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పటికై నా వాస్తవాలు గ్రహించి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, గోలి చంద్రశేఖర్ రెడ్డి, ఆతుకూరు సుబ్బారావు, ఎన్. దుర్గారావు, డోకల రాము, గొట్టాపు బాబు, నాయకులు పాల్గొన్నారు.


