శోభనగిరిపై శాంతి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

శోభనగిరిపై శాంతి కల్యాణం

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

శోభనగిరిపై శాంతి కల్యాణం కొనసాగిన నామినేషన్లు 13 మంది సర్పంచ్‌ల ఏకగ్రీవం రేపు విద్యుత్‌ వినియోగదారుల సదస్సు కళాశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని శోభనగిరిపై శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు శాంతి క ల్యాణం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూ జలు జరిగాయి. సుదర్శన మంత్ర హోమం, పూర్ణాహుతి, నిత్య హోమం, బలహరణ పూజాదికాలు నిర్వహించారు. అర్చకులు వేదాంతం శేషుబాబు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో మూడో విడత పంచాయతీ నామినేషన్ల పర్వం ఆదివారం కొనసాగింది. రెండో రోజు సర్పంచ్‌ స్థానాలకు 403, వార్డు సభ్యుల స్థానాలకు 2,235 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా దెందులూరులో సర్పంచ్‌ స్థానాలకు 33, వార్డు సభ్యుల స్థానాలకు 255, ఏలూరులో సర్పంచ్‌ స్థానాలకు 47, వార్డు సభ్యుల స్థానాలకు 173, పెదపాడులో సర్పంచ్‌ స్థానాలకు 48, వార్డు సభ్యుల స్థానాలకు 350, పెదవేగి మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 84, వార్డు సభ్యుల స్థానాలకు 430, చాట్రాయి మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 45, వార్డు సభ్యుల స్థానాలకు 226, ఆగిరిపల్లి మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 46, వార్డు సభ్యుల స్థానాలకు 246 నామినేషన్లు దాఖలయ్యాయి. ముసునూరులో సర్పంచ్‌ స్థానాలకు 42, వార్డు సభ్యుల స్థానాలకు 188, నూజివీడు మండలంలో సర్పంచ్‌ స్థానాలకు 58, వార్డు సభ్యుల స్థానాలకు 367 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 13 మంది సర్పంచ్‌లు, 324 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. 11 మండలాల్లోని 177 పంచాయతీల్లో 177 సర్పంచ్‌లకు, 1,896 వార్డు మెంబర్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కామవరపుకోట మండలం పోలాసిగూడెం సర్పంచ్‌గా బిక్కిన వెంకటరావు, సాగుపాడు సర్పంచ్‌గా అలవా టు విరిజ, కొయ్యలగూడెం మండలం బ య్యనగూడెంగా సర్పంచ్‌ తేజ విశ్వనాథ్‌ బాబు, పొంగుటూరు సర్పంచ్‌గా రాజనాల ధనలక్ష్మి, కుక్కునూరు మండలం అమరవరం సర్పంచ్‌గా మోసం కన్నయ్య, దామరచర్ల సర్పంచ్‌గా తాటి రమణ, కివ్వాక సర్పంచ్‌గా పోడియం సమ్మక్క, తొండిపాక సర్పంచ్‌గా కారం రమేష్‌, ఉప్పేరు సర్పంచ్‌గా కుంటా ముత్తయ్య, పోలవరం మండలం గెడ్డపల్లి సర్పంచ్‌గా కెచ్చెర్ల చిన్న చిన్నారెడ్డి, టి.నర్సాపురం మండలం బొర్రంపాలెం సర్పంచ్‌గా కె.ఝటేశ్వరరావు, చింతలపూడి మండలం ఉర్లగూడెం సర్పంచ్‌గా నందిగం మహేశ్వరీ, లింగపాలెం మండలం బాదరాల సర్పంచ్‌గా మాడా నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూజివీడు: విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విద్యుత్‌ వినియోగదారుల అదాలత్‌, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ నూజివీడు ఈఈ బి.రాజమోహన్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న రా యల్‌ గ్రాండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అధ్యక్షుడు డి.కృష్ణానాయక్‌ పాల్గొంటారని, విద్యుత్‌ బిల్లులు, నూతన విద్యుత్‌ సర్వీసుల మంజూ రు, విద్యుత్‌ మీటర్ల సమస్యలు, బిల్లుల సవరణలు, విద్యుత్‌ సరఫరా సమస్యలు, ఇతర విద్యుత్‌ సేవలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.

భీమవరం : పట్టణంలో ప్రైవేట్‌ కళాశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్టు భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.రమేష్‌ ఆది వారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 21న రాత్రి సమయంలో గేదెల మహాలక్ష్ముడు(55) తాపీ పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా పట్టణంలో తిరుమల కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రుడిని బాధితుడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రమేష్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement