బహిరంగ దాడి.. రహస్య రాజీ ! | - | Sakshi
Sakshi News home page

బహిరంగ దాడి.. రహస్య రాజీ !

Nov 23 2026 5:24 AM | Updated on Nov 23 2026 5:24 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్రవ్యాప్తంగా సంచల నం సృష్టించిన ఏలూరులో ఆలయ అర్చకుడిపై టీ డీపీ నాయకుడి దాడి ఘటనను తెరమరుగు చేసేందుకు అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫ లించాయి. బాధితుడికి అండగా నిలవాల్సిన స్థానిక బ్రాహ్మణ సంఘాల నాయకులే అధికార పార్టీకి తలొగ్గి, ఎలాంటి న్యాయం చేయకుండానే వివాదం ముగిసినట్టు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి గురైన అర్చకుడికి ఏం న్యాయం చేశారో స్పష్టం చేయకుండా నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘ నాయకులుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు రాజీ కుదిర్చామని ప్రచా రం చేసుకోవడం విడ్డూరంగా ఉంది.

విచారం వ్యక్తం చేశారట.. వివాదం ముగిసిందట!

దేవస్థానం ప్రాంగణంలో నలుగురి ముందూ ఆగ్రహావేశాలతో అర్చకుడిపై దాడి చేసిన టీడీపీ నాయకుడు, ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అదే ఆలయంలో పనిచేయాల్సి ఉందన్న కారణంతో బాధిత అర్చకుడిపై ఒత్తిడి తెచ్చి రాజీకి ఒప్పించినట్టు ప్ర చారం జరుగుతోంది. బ్రాహ్మణ సంఘాల నాయకులు వీరిద్దరినీ నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి చేతులు కలిపించారు. పైగా విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా క్షమాపణ ప్రస్తావన లేకుండా, కేవలం జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయడంతోనే వివాదం సద్దుమణిగినట్టు ప్రకటించడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వ్యతిరేకత

బాధ్యతాయుతమైన ట్రస్ట్‌బోర్డు సభ్యుడే సాక్షాత్తూ ఆలయ ప్రాంగణంలో అర్చకుడిపై చేయి చేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాలకు చెందిన బ్రా హ్మణ సంఘాల నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఏలూరులోని బ్రాహ్మణ, అర్చక సంఘాల మౌనా న్ని ప్రశ్నిస్తున్న వారు, దాడి చేసిన వ్యక్తితో బహిరంగ క్షమాపణ చెప్పించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.

బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే..

నలుగురిలో దాడి చేసి, గదిలో చేతులు కలిపితే న్యాయం జరిగినట్లేనా అని భక్తులు నిలదీస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో బూటు కాళ్లతో సంచరించి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు యావ త్తు భక్తలోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. గుడిలోకి బూట్లతో వచ్చి అర్చకుడిపై దాడి చేసిన వ్యక్తి, నాలుగు గోడల మధ్య కొందరికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే సమస్య సమసిపోదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ మాజీ సభ్యుడు చలమల సత్యనారాయణ ఓ ప్రకటనలో మండిపడ్డారు. పత్రికా ప్రకటన ద్వారా భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.

‘మమ’ అనిపించారు

అర్చకుడిపై టీడీపీ నేత దాడి

రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత

నాలుగు గోడల మధ్య రాజీ కుదుర్చిన బ్రాహ్మణ సంఘాలు

చర్యలు లేకుండానే వివాదానికి తెర

బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement