కూటమి పాలనలో సామాన్యుడి బతుకు దుర్భరం | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో సామాన్యుడి బతుకు దుర్భరం

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

● పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

● జోరుగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం

బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి నెలకొందని, బియ్యం నుంచి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు మూడు పూటలా భోజనం చేయలేని దుస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మారుమూల గ్రామమైన కామయ్యకుంటలో రాజానగరం ఎంపీటీసీ అభ్యర్థి కొవ్వాసి వరలక్ష్మి, జెడ్పీటీసీ అభ్యర్థి కోర్సా బాలకృష్ణల ఎన్నికల ప్రచారాన్ని బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులను పూర్తి చేసి సుపరిపాలన అందించారని గుర్తుచేశారు. అక్రమ మార్గంలో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతి రామన్నపాలెం ఎంపీటీసీ అభ్యర్థి పూనెం కుమారి ఎన్నికల ప్రచారంలోనూ వారు పాల్గొన్నారు. అలాగే మండలంలోని రాచూరులో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని, ఎంపీపీ అభ్యర్థి మడకం జంపాలును గెలిపించాలని అభ్యర్థించారు. ఉదయం నుంచి జోరున భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ అల్లూరి రత్నాజీరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరేటి సత్యనారాయణ, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి ప్రసాద్‌, నాయకులు నక్కా శివాజీ, కణితి దుర్గారావు, కొవ్వాసి పోసియ్య, దొండపాటి బాబు, బానోతు కృష్ణనాయక్‌తో పాటు ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement