ప్రతికూలతను తట్టుకునే వంగడాలు మేలు | - | Sakshi
Sakshi News home page

ప్రతికూలతను తట్టుకునే వంగడాలు మేలు

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

ప్రతికూలతను తట్టుకునే వంగడాలు మేలు

భీమడోలు: అర్నబ్‌ తుపాను నేపథ్యంలో, నేలకొరిగిన, దెబ్బతిన్న పంటలను బుధవారం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పీవీ సత్యనారాయణ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల బృందం పరిశీంచింది. పూళ్ల శివారులో నీట మునిగి, నేలకొరిగిన పంటలను, కోడూరుపాడు మాజీ సర్పంచ్‌ మానుకొండ నాగేశ్వరరావు సాగు చేసిన ఎంటీయు 1318 వరి పంటను పరిశీలించింది. ఈ సందర్భంగా వైస్‌ ఛాన్సలర్‌ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని అన్నారు. సార్వా (ఖరీఫ్‌) సీజన్‌లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తేలికగా నేలకొరిగే స్వర్ణ వంటి రకాల సాగును కట్టడి చేయాలని కోరారు. భీమడోలు సబ్‌ డివిజన్‌ పరిధిలో దెబ్బతిన్న పంటల వివరాలను భీమడోలు ఏడీఏ పి. ఉషారాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ జి.రామచంద్రరావు, వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ఏలూరు ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ ఫణికుమార్‌, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌. నాగేంద్రబాబు, భీమడోలు ఏడీఏ పి.ఉషారాజకుమారి, వ్యవసాయ అధికారులు (ఏవోలు) ఎస్‌పీవీ ఉషారాణి, ప్రవీణ్‌కుమార్‌, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement