స్థానిక సమరం.. బెదిరింపుల పర్వం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరం.. బెదిరింపుల పర్వం

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

వైభవంగా శ్రీవారి చక్రస్నానం మాజీ మంత్రి మాగంటికి పరాభవం

న్యూస్‌రీల్‌

వైభవంగా శ్రీవారి చక్రస్నానం
ద్వారకాతిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆశ్వీయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన మంగళవారం శ్రీచక్ర స్నాన వేడుకను అర్చకులు వైభవంగా నిర్వహించారు. 8లో u
మాజీ మంత్రి మాగంటికి పరాభవం

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపొందడానికి కూటమి తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగింది. ఆస్థి నష్టాలు కలిగిస్తామని.. కేసులతో వేధిస్తామని రకరకాలుగా బెదిరింపులకు పాల్పడ్డారు. దారికి రాని వారిపైన కిడ్నాప్‌ యత్నాలకు ప్రయత్నించారు. మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పెదవేగి జెడ్పీటీసీ, అలాగే 12 ఎంపీటీసీలు జిల్లాలో ఏకగ్రీవమయ్యాయి.

బెదిరింపులు.. బేరసారాలు

స్థానిక సంస్థల పోరు కీలకదశకు చేరుకుంది. డమ్మీలు, స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లా వ్యాప్తంగా 454 ఎంపీటీసీ స్థానాలకు 2374 నామినేషన్లు, అలాగే 27 జెడ్పీటీసీ స్థానాలకు 224 నామినేషన్లను పరిశీలన అనంతరం ఆమోదించారు. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె చింతమనేని నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అలాగే 454 ఎంపీటీసీ స్థానాల్లో 12 ఏకగ్రీవమయ్యాయి. వీటిలో కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం– 1, 2 ఎంపీటీసీ స్థానాలను పెద్ద మనుషుల తీర్మానం పేరుతో టీడీపీ–1, వైఎస్సార్‌సీపీ చెరో స్థానం ఏకగ్రీవం చేశారు. అలాగే పెదవేగి మండలం కొండలరావుపాలెం ఎంపీటీసీ స్థానం వైఎస్సా ర్‌కాంగ్రెస్‌ పార్టీకి ఏకగ్రీవమైంది. కై కలూరు నియోజకవర్గంలోని కై కలూరు మండలం వేమవరప్పాడు ఎంపీటీసీ స్థానం టీడీపీకి ఏకగ్రీవమైంది. మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలుండగా 21 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వేమవరప్పాడు ఎంపీటీసీ, సర్పంచ్‌ అభ్యర్థి వ్యక్తిగతంగా గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చే షరతుతో గత రెండు పర్యాయాలుగా ఏకగ్రీవాలు చేస్తున్నారు. ఈ సారి కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది. లింగపాలెం మండలంలోని రంగాపురం ఎంపీటీసీ టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా ధర్మాజీగూడెం–1 జనసేన పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ద్వారకాతిరుమల మండలంలో ఒక స్థానం, పెదవేగి మండలంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది.

కిడ్నాప్‌ హడావుడి : చింతలపూడి మండలంలోని నామవరం ఎంపీటీసీని టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో బెదిరింపులు ప్రలోభాలతో హడావుడి చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థిగా పోటీచేసిన బాణావత్‌ ఉమామహేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. బీ–ఫారమ్‌ అధికారులకు అందకుండా కుటుంబ సభ్యులే ఒత్తిడి తేవడంతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో టీడీపీ వేధింపులు తట్టుకోలేక అజ్ఞాతంలో ఉన్నట్లు ఉమామహేశ్వరరావు సెల్ఫీ వీడియో విడుదల చేయడం, గడువు ముగిసేలోపు బీ–ఫారమ్‌ను రిటర్నింగ్‌ అధికారికి అందించడంతో ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించారు.

ప్రతిపక్ష ఎంపీటీసీ అభ్యర్థులపై తీవ్ర బెదిరింపులు

అనేక స్థానాల్లో ఏకగ్రీవానికి ప్రయత్నాలు

27 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక స్థానం ఏకగ్రీవం

454 ఎంపీటీసీ స్థానాల్లో 12 ఏకగ్రీవం

బయ్యన్నగూడెం–2, కొండలరావుపాలెం ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం

మాజీ మంత్రి మాగంటికి తీవ్ర పరాభవం

తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి మాగంటి బాబుకు మరోసారి తీవ్ర అవమానం ఎదురైంది. కామవరపుకోట జెడ్పీటీసీ స్థానం నుంచి ఆయన సతీమణి పద్మవల్లీదేవి జెడ్పీ చైర్మన్‌ పదవి ఆశిస్తూ అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీఫారాల్లో కామవరపుకోట స్థానం మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ కుమార్తె గంటా జాహ్నవికి ఖరారు చేయడంతో బాబు వర్గం కంగుతింది. విధి పరిస్ధితుల్లో నామినేషన్‌ ఉపసంహరించుకుని పోటీ నుంచి దూరమయ్యారు. గతంలో మాగంటి బాబు ప్రాతినిధ్యం వహించి అనంతరం ఇన్‌ఛార్జిగా ఉన్న ఎంపీ స్థానానికి పుట్టా మహేష్‌ యాదవ్‌కు కేటాయించి అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ముఖ్యులు ఇచ్చిన హామీ మేరకే జెడ్పీ చైర్మన్‌గా పోటీ చేసి మరోసారి భంగపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement