కూటమిలో పొత్తుల కుంపటి | - | Sakshi
Sakshi News home page

కూటమిలో పొత్తుల కుంపటి

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

ఏం కొనేటట్లు లేదు కూటమిలో పొత్తుల కుంపటి

ఏం కొనేటట్లు లేదు
ఇటీవల కాలంలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల గురించి గ్రామ పెద్దల సంభాషణ. 8లో u
రెబల్స్‌, నామినేషన్ల తిరస్కరణతో పలుచోట్ల త్రిముఖ పోరు

ద్వారకాతిరుమల: మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అధికార కూటమిలో పొత్తుల లెక్కలు తారుమారవ్వడం, నామినేషన్ల తిరస్కరణ మరియు రెబల్‌ అభ్యర్థులు బరిలో నిలవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

పొత్తుల దెబ్బ.. స్వతంత్ర అభ్యర్థిగా దేవిశ్రీ

జెడ్పీటీసీ స్థానాన్ని ఆశించిన జనసేన మండల అధ్యక్షుడు దాకారపు నరసింహమూర్తికి నిరాశే మిగిలింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో ఆయన తన భార్య దేవిశ్రీతో నామినేషన్‌ వేయించారు. అయితే చివరి క్షణంలో పార్టీ మ్యాండేట్‌ దక్కకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుసనబోయిన విజయలక్ష్మి, టీడీపీ అభ్యర్థి కరుటూరి సత్యశ్రావణి, స్వతంత్ర అభ్యర్థి దేవిశ్రీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

ఎంపీటీసీ స్థానాల్లో తారుమారైన సమీకరణాలు

ద్వారకాతిరుమల–1 స్థానాన్ని మొదట జనసేనకు కేటాయించగా, అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో డమ్మీగా నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్థి బరిలో నిలవడంతో ఈ స్థానం జనసేన చేయిజారింది. ప్రత్యామ్నాయంగా పి.కన్నాపురం స్థానాన్ని జనసేనకు ఇవ్వగా, అక్కడ వైఎస్సార్‌సీపీ, జనసేన, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ ఏర్పడింది. గుణ్ణంపల్లి ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీకి కేటాయించినప్పటికీ, జనసేనకు చెందిన యిర్రింకి సప్తగిరి రెబల్‌గా బరిలోకి దిగారు. దీంతో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన రెబల్‌ అభ్యర్థుల నడుమ త్రిముఖ సమరం అనివార్యమైంది. పంగిడిగూడెం–1 స్థానంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement