ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా గోపాలరాజు | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా గోపాలరాజు

Oct 13 2026 12:59 AM | Updated on Oct 13 2026 12:59 AM

ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌గా గోపాలరాజు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల అధ్యక్షుడిగా నాగభూషణం స్పెషల్‌ టెట్‌కు 292 మంది.. దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే ఊరుకోం హెల్త్‌ సెక్రటరీల వినతి

నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆర్జీయూకేటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయ ణ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన్ను ఇన్‌చార్జి చాన్సలర్‌గా కూడా ప్రభుత్వం నియమించడంతో ఒకే వ్యక్తి మూడు బాధ్యతలను నిర్వహిస్తున్నట్లయింది. దీనిపై సెప్టెంబరు 19న ట్రిపుల్‌ఐటీ.. పాలన తీరేంటి? శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా గోపాలరాజును నియమించి బాధ్యతలు అప్పగించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏలూరులో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కె.నాగభూషణం, వైస్‌ చైర్మన్‌గా కిషోర్‌, ప్రధాన కార్యదర్శిగా మధుకాంత్‌, ఉపాధ్యక్షులుగా మ ద్దాల సుబ్బారావు, సంసాని వెంకటేశ్వర రావు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు కృషిచేస్తామన్నారు. నాగభూషణాన్ని సోమవారం హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఈఈ కేవీఎస్‌ ప్రసాద్‌, హౌసింగ్‌ మేనేజర్‌ టి.కనకరాజు తదితరులు ఘనంగా సన్మానించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్పెషల్‌ టెట్‌ పరీక్షలకు రెండో రోజు సోమవారం 292 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్‌ పాఠశాలల్లో ఉదయం సెషన్‌లో 175 మందికి 168 మంది, మధ్యాహ్నం 125 మందికి 124 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాల విద్యాశాఖ విద్యా సంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం ఈనెల 12 నుంచి 21 వరకూ దసరా సెలవులు ప్రకటించామని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవు దినాల్లో ప్రైవేట్‌ పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న హెల్త్‌ సెక్రటరీ, ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ యునైటెడ్‌ విలేజ్‌, వార్డ్‌ సెక్రటరీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వికి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించారు. సంఘ జిల్లా కార్యదర్శి టి.శ్రీలక్ష్మి మాట్లాడుతూ హెల్త్‌ సెక్రటరీలను వైద్యారోగ్య శాఖలో విలీనం చేయాలని, యాప్‌ల భారం తగ్గించాలని, ఆరోగ్య కార్యక్రమాల సర్వేలను ఓటీపీతో సంబంధం లేకుండా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సంఘ గౌరవ అధ్యక్షుడు డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ప్రెసిడెంట్‌ ఆర్డర్‌ 2025 కారణం చూపుతూ ప్రమోషన్లు నిలుపుదలను సడలించి తక్షణమే వైద్యారోగ్య శాఖలో అన్ని క్యాడర్‌లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement