తాడేపల్లిగూడెం రూరల్: మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో పెదతాడేపల్లి గాయత్రీ కల్యాణ మండపంలో ఆదివారం అండర్–19 ఓపెన్ జిల్లా రాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. తొలుత జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్. మోహన్‌దాస్, జిల్లా ఆడిట్ అధికారి మధుబాబు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారుల మెదడుకు పదును పెట్టడంలో చదరంగం క్రీడ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. సుమారు 100 మంది క్రీడాకారులు హాజరైన ఈ పోటీల్లో మొదటి పది స్థానాలు సాధించిన వారు డిసెంబరు 5, 6 తేదీల్లో జరిగే అఖిల భారత రాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. టోర్నమెంట్‌కు చీఫ్ ఆర్బిటర్‌గా వైడీ ప్రసాద్ వ్యవహరించారు.


