● బలవంతపు భూసేకరణను సహించం
● బాధిత రైతులకు వైఎస్సార్‌సీపీ అండ
చింతలపూడి : రేచర్లలో అండర్ గ్రౌండ్ కోల్ గ్యా సిఫికేషన్ ప్రాజెక్టు (యూజీసీ) ప్రభావానికి గురవుతున్న రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ రేచర్ల, చింతలపూడి ప్రాంతాల్లో ప్రతిపాదిత అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సాగుభూములు, వ్యవసాయం, భూగర్భ జలాలు, పంటలపై పడే ప్రభావంపై పూర్తి స్పష్టత ఇవ్వకుండా ముందుకు సాగడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాజెక్టు వల్ల కలిగే దుష్ప్రభావాలపై అంతటా ఆందోళన నెలకొందన్నారు. ప్రాజెక్టు వల్ల రైతులకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నష్టపరిహారం, పునరావాసం విధి విధానాలేంటి? అనే అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. రైతులు, స్థానికులతో సమగ్ర ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు. ఇటీవల నూజివీడు తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో బలవంతంగా సంతకాలు చే యించుకున్నారన్న వార్తలను విజయరాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో అన్నదాతలపై ఇటువంటి చర్యలు అత్యంత శోచనీయమన్నారు. పూర్తి పారదర్శకత, రైతుల సంపూర్ణ ఆమోదం లేకుండా భూములను లాక్కునే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. రేచర్ల రైతుల సమస్యను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ పార్టీ వెనకడుగు వేయబోదని, అవసరమైతే అన్నదాతలకు భరోసా కల్పి ంచేందుకు వైఎస్ జగన్‌ను స్వయంగా రేచర్ల ప్రాంతానికి తీసుకొస్తామని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఎం.నీరజా, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి సీహెచ్ జ్ఞానారెడ్డి, రాష్ట్ర మేధావుల విభాగం కార్యదర్శి గోలి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు తాండ్ర రవిబాబు, ఎన్.దుర్గారావు, మిరియాల దిలీప్, యడ్ల మోహన్‌రావు,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


