జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి
తణుకు అర్బన్: జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నైపుణ్యాలను మెరుగుపరచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం తణుకు కోర్టు ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జూనియర్ న్యాయవాదులు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని ఏకాగ్రతతో కేసులు వాదించాలని స్పష్టం చేశారు. చరిత్ర కలిగిన తణుకు కోర్టులో తణుకు బార్ అసోసియేషన్ నుంచి కనీసం ముగ్గురు న్యాయవాదులు ఆఫీసర్స్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణకు ప్రాధాన్యమివ్వాలని, అధిక సమయం కోర్టులో గడపాలని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సత్తి మా ట్లాడుతూ బార్‌లో సీనియర్లు ఆచరించే మంచి విషయాలను జూనియర్స్ పాటించాలని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి నైనాల జయసూర్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. సీనియర్ న్యాయవాదులను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గోటేరు భాస్కరమూర్తి, న్యాయవాద గుమస్తాల సంఘ నాయకులు కటకం కృష్ణమూర్తిలను సత్కరించారు. తణుకు కోర్టులోని సమస్యలను న్యాయవాదులు న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లారు. ముందుగా మూడో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు, జు డీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్డు, జెరాక్స్ మె షీన్, వాటర్ ప్లాంట్, కక్షిదారుల వెయిటింగ్ షెడ్‌ల ను న్యాయమూర్తులు ప్రారంభించారు. జిల్లా ప్రి న్సిపల్ జడ్జి సిరివరపు శ్రీదేవి, తణుకు నాల్గో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి పాల్గొన్నారు.
ప్రశ్నలు అడగడంతోనే..
తాడేపల్లిగూడెం (టీఓసీ) : సరైన ప్రశ్నలు అడగటంతోనే అడ్వకేట్స్ నైపుణ్యాలు పెరుగుతాయని హైకో ర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ కోర్టుల సముదా యం ఆవరణలో మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. న్యాయమూర్తులు, అడ్వకేట్లు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. హైకోర్టు జడ్జి నైనాల జయసూర్య, మరో జడ్జి సత్తి సుబ్బారెడ్డి మా ట్లాడారు. అనంతరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి శ్రీదేవి (ఏలూరు)ని సత్కరించారు.


