కొయ్యలగూడెం : నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు చే స్తున్న కుతంత్రాలను సమష్టిగా ఎదుర్కోవాలని ఆ యుధ డిపో నిర్మాణ వ్యతిరేక ఆందోళనకారులు పిలుపు ఇచ్చారు. ఆదివారం మంగపతిదేవిపేటలో రైతులతో కలిసి సమావేశం నిర్వహించారు. జీవనాధారమైన పంట భూములను నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని బోడిగూ డెం, మంగపతిదేవిపేట, బర్కెట్‌నగర్ గ్రామాల రై తులు తేల్చి చెప్పారు. మాల మహానాడు రాష్ట్ర అ ధ్యక్షుడు బొగ్గవరపు బాబురావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగ్గా.. రాష్ట్ర మాల మహాసేన అధ్యక్షుడు అలగా రవి, విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద శేఖర్ ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ రైతుల పోరాటానికి అండగా నిలుస్తామన్నారు. కొందరు భూమి లేని రైతులు దళారులుగా మారి డిపో కా వాలి అని చెబుతున్నారన్నారు. డిపో నిలుపుదల చేయకపోతే ఆందోళనలకు సిద్ధమని, ఇదే వి షయాన్ని ముఖ్యమంత్రికి వినతిపత్రం ద్వారా వివరిస్తామని రైతులు అన్నారు. యేహేజెకేల్, పెన్నాడ యాకోబు, దాసరి సుందరరావు, కొడమంచిలి వెంకటరత్నం, పెనుమకుల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి) : గుర్వా యిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం తొలిరోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, దీక్షాధారణలు జరిపారు. ఏడాది కాలంలో ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల నివారణకు, స్వామివారి కృపాకటాక్షాల కోసం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్టు అర్చకులు తెలిపారు. ఆలయ ఈఓ ఆర్‌వీ చందన, ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ పాల్గొన్నారు.
దెందులూరు: ఇన్‌సర్వీస్ బీపీఈడీ, బీఈడీ కోర్సులకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నత్తానియేలు అన్నారు. ఆదివారం కళాశాలలో ఆయన మాట్లాడుతూ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు ఎస్సీ, ఎస్టీలకు జీఓ 342 ప్రకారం జీతంతో కూడిన సెలవులు, ఇతరులకు లాస్ ఆఫ్ పేలో సెలవుతో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లులో ఆదివారం రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఆరు జిల్లాల నుంచి 67 మంది క్రీడాకారులు హాజరయ్యారు. విజేత లకు రూ.30 వేల నగదు బహుమతులు అందించారు. చొప్పా వీర వెంకట వివేశ్ (ఏలూరు జిల్లా), ఆముదాలపల్లి పూజిత (పశ్చిమగోదా వరి), పినిశెట్టి ధరణి (కోనసీమ), కొట్టాల గీత శ్రీ (అనకాపల్లి), ఎం.మౌర్యసూర్య (పశ్చిమ గోదావరి) మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు.


