ఇష్టారాజ్యం.. వార్డు పునర్విభ‘జనం’ | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యం.. వార్డు పునర్విభ‘జనం’

Sep 14 2026 5:24 AM | Updated on Sep 14 2026 5:24 AM

నూజివీడు : మున్సిపల్‌ పరిపాలన అనుభవం లేని అధికారులు.. విధి నిర్వహణలో అలసత్వం.. రాజకీయ పార్టీల నాయకులతో సమన్వయ లోపం వె రసి నూజివీడు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా, గందరగోళంగా మా రింది. మున్సిపాలిటీలో వార్డులను 32 నుంచి 36కు పెంచారు. అయితే మున్సిపల్‌ అధికారులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వార్డులను వి భజించారని రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతి వార్డులో 1,100 ఓట్లకు పది శాతం ఓట్లు పెరగడం లేదా తగ్గడం ఉండాలని నిబంధనలు ఉన్నా.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. నిర్దిష్ట హద్దులేమీ లేకుండా వార్డులను విభజించడంతో పోటీలో నిలిచే అభ్యర్థులు ఓట్లరను వెతుక్కోవడం కష్టతరం కానుంది. దీంతో శాసీ్త్రయంగా, నిబంధనల ప్రకా రం పునర్విభజన చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఒక వార్డులో 847 ఓట్లు.. మరో వార్డులో 1,513 ఓట్లు

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఓటర్ల సంఖ్యే నిదర్శనంగా ఉంది. 29వ వార్డును 847 ఓట్లుతో వి భజించగా.. 34వ వార్డును 1,513 ఓట్లతో విభజించారు. ఒక వార్డులో అత్యంత కనిష్ట సంఖ్యలో, మ రో వార్డులో దానికి దాదాపు రెట్టింపు సంఖ్యలో ఓ టర్లను ఎలా విభజిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నా యి. నిబంధన ప్రకారం అన్ని వార్డుల్లో 1,000 నుంచి 1,200 ఓట్ల వరకు మాత్రమే ఓటర్లు ఉండాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఇక్కడ జరిగింది. 17వ వార్డులో 866 ఓట్లు, 4వ వార్డులో 915 ఓట్లు, 14వ వార్డులో 942 ఓట్లు, 13వ వార్డులో 970 ఓట్లు ఉండగా, 15వ వార్డులో 1,499 ఓట్లు, 35వ వా ర్డులో 1,456 ఓట్లు, 3వ వార్డులో 1,442 ఓట్లు, 22వ వార్డులో 1,440 ఓట్లు, 26వ వార్డులో 1,383 ఓట్లు ఉండటం గమనర్హం.

సరిహద్దులపై స్పష్టత లేదు

జనాభా సంఖ్య, ఓటర్ల జాబితాల మధ్య సమ న్వయం చేసుకుంటూ వార్డులను విభజన ప్రక్రియ ను చేయాలి. అయితే అలా కాకుండా ఆఫీసులో కూ ర్చుని రికార్డుల్లోని ఇంటి నంబర్ల ఆధారంగా విభ జన చేయడం వల్ల వార్డు పరిధి గాని, వార్డు సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయనే అంశాలపై ప్రజలకు గాని, రాజకీయ నాయకులకు గాని స్పష్టత లేకుండా పోయింది. ఏ డోర్‌ నంబర్‌ ఏ వార్డులోకి వస్తుంది, ఏ వీధి ఏ వార్డులో ఉంటుందనే వాటిపై కూడా స్పష్టత లేదు. పాతవార్డులు కొన్నింటిని అసలు ఏ మాత్రం కదిలించకుండా అలాగే ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ నాయకుల ప్రమేయంతోనే పునర్విభజన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల అనుభవలేమి

తికమకగా నూజివీడులో వార్డుల విభజన

కొన్నిచోట్ల 850 ఓట్లు, మరికొన్ని చోట్ల 1,500కు పైగా..

సరిహద్దులపైనా స్పష్టత కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement