ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియేషన్ ఈపీడీసీఎల్ డిస్కం కార్యదర్శిగా నగరానికి చెందిన తురగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించగా.. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎ.అప్పలరాజు, తురగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తురగా రామకృష్ణ మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 లోపు సంస్థలో చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు (పాత పెన్షన్ విధానానికి) మార్చడానికి కృషి చేస్తానని, అలాగే డిస్కం పరిధిలో ఉన్న సమస్యలపై సీఎండీతో చర్చించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను విద్యుత్ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర నాయకులు, వివిధ కంపెనీల నాయకులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, డివిజన్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


