ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని న్యాయమూర్తి ప్ర త్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆల య ముఖ మండపంలో ఆయనకు అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఏఈఓ పి.నటరాజారావు స్వామివా రి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా ప్రజలంతా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని గణపతిని ప్రార్థిస్తున్నా మన్నారు.
పోలవరం రూరల్ : ఎగువన నదీ పరీవాహక ప్రాంతాల్లోని భారీ వర్షాలతో పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 30 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్ట్ స్పిల్‌వేకి చెందిన 48 గేట్ల ద్వారా 2,17,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇసుక మేటలు ముంపునకు గురవుతున్నాయి. దిగువన వరద ప్రవాహం తీవ్రమవుతుండటంతో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కామవరపుకోట : జాతీయస్థాయి అథ్లెటిక్స్ పో టీలకు ఈస్ట్ యడవల్లి హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు రవి ఎంపికయ్యారని హెచ్‌ఎం కోటేశ్వరి తెలిపారు. తణుకులో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 40 ప్లస్ విభాగంలో రవి హైజంప్‌లో స్వర్ణ, హేమర్ త్రోలో రజత పతకాలు సాధించారన్నారు. ఆయన వచ్చేనెల 9 నుంచి 11 వరకు కోయంబత్తూరులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.


