ముదినేపల్లి రూరల్: హిందీ ఉపాధ్యాయుల రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడిగా స్థానిక జెడ్పీ హైస్కూల్ హిందీ ఉపాధ్యాయుడు ఇనుపకుతిక సత్యనారాయణరాజు ఎంపికయ్యారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎంపికలు గుంటూరులో ఆదివారం జరిగినట్లు సత్యనారాయణరాజు తెలిపారు. ఇప్పటివరకు ఆయన సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. సత్యనారాయణరాజు ఎంపికపై స్థానిక ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ.. ఆయన సంఘ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. సంఘానికి రాష్ట్రవ్యాప్తంగా మరింత గుర్తింపు దక్కేలా సాయశక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు.


