కొల్లేరుపై లోకల్‌ రాజకీయం | - | Sakshi
Sakshi News home page

కొల్లేరుపై లోకల్‌ రాజకీయం

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

న్యూస్‌రీల్‌

శాశ్వత పరిష్కారం అంటే..

హామీలను అమలు చేయండి

స్థానిక ఎన్నికల కోసమే..

మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొల్లేరు రాజకీయానికి కూటమి తెరలేపింది. ప్రజల ఓట్లకు గాలం వేయడానికి భూపంపిణీ అంటూ కొత్త హామీతో ముందుకు వస్తోంది. లంక గ్రామ ప్రజల అమాయకత్వాన్ని ఓట్ల రూపంలో మలచుకుని స్థానిక పోరు ముగిసిన తర్వాత విస్మరించే తరహాలో కొత్త హామీల హడావుడికి తెరదీయడం కొల్లేరులో చర్చనీయాంశంగా మారింది. కొల్లేరు 5వ కాంటూరు అభయారణ్య పరిధిలో అక్రమ చెరువుల తొలగింపుపై సుప్రీంకోర్టు, సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ) ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి భిన్నంగా కూటమి నేతలు అమలయ్యే అవకాశం లేదని తెలిసినా భూముల పంపిణీ పేరుతో గాలం వేస్తున్నారు.

77,138 ఎకరాల్లో..

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో కొల్లేరు 5వ కాంటూరు వరకు 9 మండలాల పరిధిలో 122 గ్రామాల్లో 77,138 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. మొత్తం విస్తీర్ణంలో 14,932 పట్టా భూములు, 5,510 డీ ఫాం భూములను మినహాయించాలని కూటమి నేతల అండదండలతో పలువురు సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేశారు. గతేడాది కొల్లేరు పరిశీలనకు వచ్చిన సీఈసీ ముందు రాజకీయనేతలు పలు డిమాండ్లు పెట్టగా అవి తిరస్కరణకు గురయ్యాయి. పైగా రెండు నెలల్లో చిత్తడి నేలల చట్టం ప్రకారం సరిహద్దులను అందించాలని అధికారులను హెచ్చరించింది.

ఎన్నికల నాటకం.. భూ పంపిణీ హామీలు

కోర్టు వివాదాలు, కేంద్ర నిబంధనలు గుదిబండగా మారిన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి నేతలు మళ్లీ పాత పాట అందుకున్నారు. కొల్లేరు భూములను రైతులకు, నిరుపేదలకు పంపిణీ చేస్తామంటూ దశాబ్దాలుగా చెప్పిన మాటనే మళ్లీ చెబుతున్నారు. ఇటీవల కై కలూరు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు సైతం కొల్లేరు వ్యవహారంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. కొల్లేరు సరిహద్దుల వివాదం న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో భూ పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్నకు నేతల వద్ద సమాధానం లేదు.

కొల్లేరు పరీవాహక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని పదేపదే చెబుతున్నారు. మరోపక్క సుప్రీంకోర్టు చిత్తడి నేలల చట్టం అమలు కోసం అధికారులను నివేదికలు కోరింది. కొల్లేరు అభ యారణ్య చట్టం కాంటూరు 5 వరకు ఉంటే చిత్తడి నేలల చట్టం కాంటూరు 10 వరకు ఉంటుంది. కొల్లేరు అభయారణ్య పరిరక్షణ అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యత కలిగిన పర్యావరణ అంశం. న్యాయస్థానాలు, పర్యావరణ కమిటీలు అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుంటే, ఎన్నికల తాయిలాల కోసం మళ్లీ కొల్లేరు భూములను తెరపైకి తేవడం ప్రజలను వంచించడమే అని పలువురు వాపోతున్నారు.

స్థానిక పోరు నేపథ్యంలో మళ్లీ భూ పంపకం పేరుతో హడావుడి

కొల్లేరు వ్యవహారం కోర్టులో ఉన్నా కూటమి నేతల అసత్య హామీలు

లంక గ్రామాలే టార్గెట్‌గా ముందస్తు హంగామా

ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొల్లేరు భూ పంపిణీ అంటూ కొత్త హామీలు

కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో నాయకులు హామీలు ఇచ్చారు. కోర్టులు ఏం చెబుతున్నాయనే విషయాలు కొల్లేరు ప్రజలకు తెలియడం లేదు. కొల్లేరుపై స్పష్టమైన విధానాన్ని తెలపాలి. తీవ్ర తాగునీటి సమస్యను పరిష్కరించండి.

– జయమంగళ కాసులు, మాజీ సర్పంచ్‌, పెంచికలమర్రు

స్థానిక ఎన్నికల్లో పట్టు కోసమే కూటమి ప్రభుత్వం తెరపైకి మరోసారి కొల్లేరు అంశాన్ని తీసుకువచ్చింది. కూటమి నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మే పరిస్థితిలో కొల్లేరులో రైతులు లేరు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తథ్యం.

– మోరు రామరాజు, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement