18 రోజులు.. రూ.2.03 కోట్లు | - | Sakshi
Sakshi News home page

18 రోజులు.. రూ.2.03 కోట్లు

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

18 రోజులు.. రూ.2.03 కోట్లు

చినవెంకన్నకు కాసుల పంట

ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు సోమవారం స్థానిక ప్ర మోద కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 18 రోజులకు నగదు రూపంలో రూ.2,03,75,763ల ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 104 గ్రాముల బంగారం, 2.410 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.500ల నోట్ల ద్వారా రూ.6,500లు లభించాయన్నారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.11,31,987 ఆదాయం వచ్చిందన్నారు. మద్ది ఆంజనేయస్వామి ఆ లయ ఈఓ ఆర్‌వీ చందన, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement