ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి
అందని పథకం
కై కలూరు: విద్యార్థి బడి గడప దాటకుండా చూడటంలోనే విద్యావ్యవస్థ విజయం దాగి ఉంది. అక్షర ఆంధ్రా అంటూ విద్యాశాఖ ప్రచారాలు చేస్తున్నా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో డ్రాప్‌ఔట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏలూరు జిల్లాలో బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో గిరిజనులు రవాణా సౌకర్యాలు లేక పాఠశాలలు మానివేస్తున్నారు. అలాగే కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో వరదలు, వర్షాల సమయంలో పాఠశాలలకు వెళ్లడం ప్రహసనంగా మారింది. దెందులూరు మండలం కోమటిలంకలో వరద వస్తే తగ్గే వరకూ పిల్లలు బడులు, కాలేజీలకు వెళ్లలేరు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తల్లిదండ్రులతో కలిసి చేపల, రొయ్యల చెరువులపై కాపాలా ఉంటూ కొందరు చిన్నారులు విద్యాజీవితాన్ని చిదిమేసుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
శ్రేయస్సు కోసం అక్షరాస్యత : 60వ వార్షిక అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఈ ఏడాది ‘ప్రజలు, గ్రహం–శ్రేయస్సు కోసం అక్షరాస్యత’ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, రీడింగ్ పోటీలు, అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు.
చదువులు సాగుతోందిలా..
నిరాక్షరాస్యత ప్రధానంగా 45 ఏళ్లుపైబడిన వయోజనులు ఏజెన్సీ (గిరిజన తాండ), కొల్లేరులంక గ్రా మాల్లో చేపల, రొయ్యల చెరువులపై పనిచేసే కూ లీల్లో కనిపిసస్తోంది. ఇక ఉన్నత విద్య, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న 15–24 ఏళ్ల యువత ఏలూరు జిల్లాలో 89 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 93 శాతం మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పురుషుల అక్షరాస్యత 78.05 శాతం, మహిళల అక్షరాస్యత 68.99 శాతంగా ఉంది. అలాగే నిరక్షరాస్యులైన పురుషులు 4,19,258 ఉండగా, మహిళలు 5,87,168 మంది ఉన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ హోటళ్లు, చేపల చెరువులు, ఇటుకుల తయారీలో చిన్నారులు మగ్గిపోతున్నారు.
గతమెంతో ఘనం : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, సీబీఎస్‌ఈ, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం విద్య, డిజిటల్ విద్యా, ట్యాబ్‌ల అందజేతతో పాటు నాడు–నేడు పథకంలో పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. దీంతో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి మాన్పించి బడికి పంపించేందుకు ఆసక్తి చూపారు. అయితే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం చిన్నపాటి కారణాలతో తల్లికి వందనం నిలిపివేస్తోంది. అలాగే ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం విద్య, సీబీసీఎన్‌సీ తొలగింపుతో చాలా మంది ప్రైవేటు పాఠశాలల బాటపడుతున్నారు.
ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కోమటిలంకకు పడవపై ప్రయాణిస్తున్న విద్యార్థులు (ఫైల్)
వరదల సమయంలో కై కలూరు డిగ్రీ కాలేజీకి వస్తున్న కోమటిలంక విద్యార్థి (ఫైల్)
2011 జనాభా లెక్కల ఆధారంగా జిల్లాల పునర్విభజన తర్వాత గణాంకాలు శాతాల్లో..
జిల్లా మొత్తం అక్షరాస్యత పురుషులు మహిళలు
ఏలూరు 71.44 77.63 71.05
పశ్చిమగోదావరి 74.63 77.92 71.36
ఉపాధ్యాయులపై యాప్‌ల రూపంలో తీవ్ర పనిఒత్తిడి పడుతోంది. గ్రామాల్లో పాఠశాలలకు రహదారి సౌకర్యాలు లేవు. వైఎస్ జగన్ పాలనలో నాడు–నేడు పనుల్లో బడులు సుందరంగా మారాయి. ప్రస్తుతం డ్రాప్‌ఔట్లు పెరుగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఇది మారాలి.
– వై.వేణుగోపాలరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత, విశ్రాంత హెచ్‌ఎం, కై కలూరు
నాకు ఇద్దరు ఆడ బిడ్డలు. కారు డ్రైవర్‌ను. వైఎస్సార్‌సీపీ పాలనలో క్రమం తప్పకుండా అమ్మఒడి పథకం పొందాను. ఇప్పుడు ఒక నెల కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందని పథకం ఆపివేశారు. కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రభుత్వం నిబంధనలు సడలించాలి.
– పొన్నబండ నరసింహా, కారు డ్రైవర్, కై కలూరు
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న డ్రాప్‌ఔట్లు
ఇంగ్లిష్ మీడియం రద్దుతో ప్రైవేట్ స్కూళ్లకు మొగ్గు
మారుమూల గ్రామాలకు లేని రవాణా సౌకర్యాలు
నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం


