ఆర్చిపై పేరు తొలగించాలంటూ వినతి | - | Sakshi
Sakshi News home page

ఆర్చిపై పేరు తొలగించాలంటూ వినతి

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

ఆర్చిపై పేరు తొలగించాలంటూ వినతి అర్జీలపై శ్రద్ధ పెట్టాలి 16 వరకూ పింఛన్ల నమోదు డిసెంబర్‌లోపు నిర్వాసితులకు కాలనీలు జిల్లా ఎస్పీ తనిఖీలు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా ప్రసాద్‌

నూజివీడు: నూజివీడు ఎమ్మార్‌ అప్పారావు కాలనీ వద్ద అనుమతి లేకుండా నిర్మించిన ఆర్చిపై కాలనీతో సంబంధం లేకపోయినా వేసిన మంత్రి కొలుసు పార్థసారథి పేరును తొలగించాలని కోరుతూ కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్‌ వెట్రిసెల్వికి సోమవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గుడిమళ్ల కృష్ణంరాజు, మున్సిపల్‌ వింగ్‌ అధ్యక్షుడు మలిశెట్టి బాబీ మాట్లాడుతూ కాలనీని 2006లో అప్పటి సీఎం వైఎస్సార్‌ శంకుస్థాపన చేసి 4 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశారన్నారు. అప్పటి నుంచి కాలనీ మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారన్నారు. ఇప్పుడు ఇష్టారాజ్యంగా నిర్మించడమే కాకుండా వారికి వారే వారి పేర్లు వే సుకోవడంపై సబ్‌ కలెక్టర్‌కు, మున్సిపల్‌ కమిషనర్‌కు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా ఆర్చిపై మంత్రి కొలుసు పేరును తొలగించాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా నూతన పింఛన్ల నమోదు ప్రక్రియ ఈనెల 16 వరకు స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డుల్లో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. అర్హులు డిజిటల్‌ అసిస్టెంట్లు లేదా వార్డు ఎడ్యుకేషన్‌–డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులను నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నెలాఖరు నాటికి 1,500 మంది పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు పునరావాస కాలనీల్లో గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులను కాలనీలకు తరలించేందుకు డిసెంబర్‌ వరకూ నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుని డిసెంబర్‌లోపు పోలవరం ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేందుకు చర్య లు తీసుకోవాలన్నారు. కాలనీలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సా రించాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌, ఐటీడీఏ పీఓ రాములు నాయక్‌, ఆర్డీఓ రమణ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు కొత్తబస్టాండ్‌లో ప్ర త్యేకంగా ఏర్పాటుచేసిన మదర్‌ ఫీడింగ్‌ సెంటర్‌ను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్‌లో సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన రీతిలో సౌకర్యాల కల్పనకు అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చే శారు. ఎంతో ప్రాధ్యానమిస్తూ కేంద్రాన్ని ఏర్పా టు చేశారని, శ్రద్ధ చూపాలని సూచించారు. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, టూటౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఆర్‌టీసీ డీఎం, సిబ్బంది ఉన్నారు.

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా ప్రసాద్‌ (ఏలూరు) బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏలూరు నుంచి రిలీవ్‌ అయ్యి గూడెం రావడానికి మధ్యాహ్నం కావడంతో 1.30 గంటల వరకు స్లాట్‌ బుక్‌ చే సుకున్నా రిజిస్ట్రేషన్లు కాలేదు. జిల్లా రిజిస్ట్రార్‌ ఆదేశాలతో ఉదయం బుక్‌ చేసుకున్న స్లాట్‌ల వారికి రిజిస్ట్రేషన్లు చేశారు. తొలిరోజు రిజిస్ట్రేషన్లు సాఫీగా జరిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement