ఆస్పత్రికి వెళ్లి వస్తూ..
ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వైద్యానికి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు మృత్యువాత పడగా తండ్రి గాయపడ్డారు. 8లో u
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రానికి రెండో ర్యాంకు లభించింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. గతనెల 4 నుంచి ఈనెల 4 వరకు జరిపిన సర్వే వివరాలను సోమవారం వెల్లడించారు. మొదటి ర్యాంక్ విజయవాడ, రెండో ర్యాంక్ ద్వారకాతిరుమల, మూడో ర్యాంక్ శ్రీకాళహస్తి, నాల్గో ర్యాంక్ అన్నవరం, ఐదో ర్యాంక్ కాణిపాకం, ఆరో ర్యాంక్ సింహాచలం, ఏడో ర్యాంక్ శ్రీశైలం దేవస్థానాలు సాధించాయి.
పెరిగిన సంతృప్తి
ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో భక్తుల సంతృప్తి శాతం ద్వారకాతిరుమల దేవస్థానంపై మాత్రమే పె రిగింది. మిగిలిన అన్ని దేవస్థానాలపై అసంతృప్తి పెరిగింది. ద్వారకాతిరుమల క్షేత్రంపై ఆగస్టులో 71.4 సంతృప్తి శాతంగా ఉండగా సెప్టెంబర్‌లో 72.1 శాతానికి పెరిగింది.


