గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా | - | Sakshi
Sakshi News home page

గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా

న్యూస్‌రీల్‌

పాఠాలు చెప్పనివ్వరా?

యాప్‌ల భారం తొలగించాలి

చినవెంకన్న దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. గోవులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8లో u

శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ విద్యను ని ర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందనే విమర్శలు విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ విద్యా సంస్థలను నీరుగార్చి, వారిని ప్రైవేట్‌ బాట పట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజా పరిణామాలు కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా దెబ్బతీసేలా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు సన్నగిల్లేలా చేసి, పేద ప్రజలు ఆర్థిక భారాన్ని సైతం లెక్కచేయకుండా తమ పిల్లలను ప్రైవేట్‌, కార్పొరేట్‌ సంస్థలకు పంపేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

బోధనకు దూరమవుతున్న ఉపాధ్యాయులు

విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచే ఉపాధ్యాయులకు రకరకాల బోధనేతర పనులు అప్పగించడం ద్వారా ప్రభుత్వం వారిని బోధనకు దూరం చేసింది. ఆ తర్వాత పేరెంట్‌–టీచర్‌ మీటింగ్‌ పేరుతో మరోసారి బోధనా సమయాన్ని తగ్గించింది. దీనికి తోడు టెట్‌ అర్హత తప్పనిసరి అనే నిబంధన ఉపాధ్యాయుల నెత్తిపై పిడుగులా పడింది. కొందరు ఉపాధ్యాయులు ఈ పరీక్షల కోసం సెలవులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐ గాట్‌ కర్మయోగి యాప్‌ ద్వారా ఉపాధ్యాయులు 60 కోర్సులు పూర్తి చేయాలనే కొత్త నిబంధన అదనపు భారంగా మారింది. ఈ కోర్సులు పూర్తి చేయకపోతే జీతాలు ఆపుతామంటూ వస్తున్న హెచ్చరికలతో ఉపాధ్యాయులు బోధనను పక్కనపెట్టి ఆ కోర్సులు పూర్తి చేసే పనిలో పడ్డారు. కొన్ని మండలాల్లో అయితే, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులను మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలకు పిలిపించుకుని జీతాల బిల్లులు, ఇతరత్రా ఆఫీసు పను లు చేయించుకుంటున్నారు.

యాప్‌ల భారం.. బోధనకు దూరం

విద్యార్థులను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం

ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్న వైనం

యాప్‌ల అప్‌లోడ్‌తోనే రోజు గడిచిపోతోంది

ఫోన్లు, డేటా ఇవ్వని ప్రభుత్వం

ఉపాధ్యాయుల ఆగ్రహం

రోజూ పలు యాప్‌లు అప్‌లోడ్‌ చేయడమే ఉపాధ్యాయుడి ప్రధాన వృత్తిగా ప్రభుత్వం మార్చివేసింది. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే అవకాశమే ఇవ్వడం లేదు. ఈ యాప్‌ల భారం ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలల మనుగడ, పేద విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలపై పెను ప్రభావమే ప డుతుంది. యాప్‌ల అప్‌లోడ్‌కు ప్రత్యేక వ్య వస్థను ఏర్పాటు చేయాలి

– తాళ్లూరి రామారావు,

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉపాధ్యాయులపై యాప్‌ల అప్‌లోడ్‌ భారాన్ని పూర్తిగా తొలగించాలి. యాప్‌లను అప్‌లోడ్‌ చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ప్రభు త్వం ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క లీప్‌యాప్‌లోనే 100 టైల్స్‌ ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికే ఎక్కువ సమయం పట్టేస్తోంది. మిగిలిన యాప్‌లను కూడా ఉపాధ్యాయులే అప్‌ లోడ్‌ చేయాలంటే విద్యార్థులకు బోధన ఎప్పుడు చేయాలి.

– గెడ్డం సుధీర్‌, వైఎస్‌ఆర్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement