కొలుసు పేరును తొలగించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

కొలుసు పేరును తొలగించాల్సిందే

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

కొలుసు పేరును తొలగించాల్సిందే

మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

ఎమ్మార్‌ అప్పారావు కాలనీ రోడ్డు వద్ద నిర్మించిన ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి పేరును తొలగించాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు డిమాండ్‌ చేశారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ కాలనీకి శంకుస్థాపన చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదలు ఇళ్లు కట్టుకునేలా చేయగా, ఈ రోజు కాలనీ రోడ్డు వద్ద ఆర్చిని అనధికారికంగా నిర్మించడమే కాకుండా మంత్రి కొలుసు పార్థసారథి సౌజన్యంతో అని రాయడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మార్‌ అప్పారావు కాలనీని ఏమై నా మంత్రి కొలుసు ఏర్పాటు చేయించారా, పే దలకు ఏమైనా మంత్రి హయాంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయించారా, ఇళ్లు మంజూరు చేశారా అని నిలదీశారు. క్రెడిట్‌ చోరీ చేయాలని చూడటం టీడీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement