వినాయక చవితి సందర్భంగా నగరాలు, పల్లెల్లో పందిళ్లల్లో కొలువయ్యే వినాయకుడి విగ్రహాలు తయారీలో వ్యాపారులు బిజీ.. బిజీగా ఉన్నారు. ఏలూరు పోస్టల్ కాలనీ వద్ద 40 ఏళ్ల నుంచి రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ విగ్రహాలు తయారీ చేస్తూ ఉంటారు. ఈ పండగ అనగానే ఇంటిల్లిపాది విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇదే పనిమీద ఉంటారు. రూ. 200 నుంచి రూ.30 వేల వరకు విలువ కలిగిన విగ్రహాలు తయారు చేస్తామని, ఈ తయారీకి రెండు నెలలు ముందు నుంచే రాజస్థాన్ నుంచి ముడిసరుకులు తెచ్చుకుని విగ్రహాలు తయారు చేసి అమ్మకం చేస్తామని తెలిపారు వ్యాపారస్తులు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు


