స్కూల్‌ బస్సును ఢీకొట్టిన గ్రావెల్‌ లారీ | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సును ఢీకొట్టిన గ్రావెల్‌ లారీ

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:09 AM

ఆగిరిపల్లి: మండలంలోని చిన్నాగిరిపల్లిలో శనివారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేటు స్కూలు బస్సును గ్రావెల్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడుకి చెందిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు 40 మంది విద్యార్థులతో చిన్నాగిరి పల్లి గ్రామం వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన గ్రావెల్‌ లారీ విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూల్‌ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థికి మోచేతికి గాయం కాగా, మరికొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామంలోకి గ్రావెల్‌ లారీలు రానిచ్చేది లేదని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోటపల్లిలోని క్వారీ నుంచి గ్రావెల్‌ తరలిస్తున్న ఈ లారీలు మంత్రి కొలుసు పార్థసారధి అనుచరులకు చెందినవిగా గ్రామస్తులు తెలిపారు.

విద్యార్థులకు స్వల్ప గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement