నిధుల దుర్వినియోగంపై మరోసారి విచారణ | - | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగంపై మరోసారి విచారణ

Aug 27 2026 1:00 AM | Updated on Aug 27 2026 1:00 AM

నిధుల దుర్వినియోగంపై మరోసారి విచారణ

కై కలూరు: నిధుల దుర్వినియోగం అభియోగాల విచారణ కై కలూరు పంచాయతీని వీడటం లేదు. రాచపట్నంకు చెందిన చక్కా మురళీ అనే వ్యక్తి కై కలూరు గ్రామ పంచాయతీ సాధారణ నిధులు దుర్వినియోగం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేయడంపై గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో మూడుసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అప్పటి కై కలూరు ఎంపీడీఓ ఆర్‌.ఫణింద్ర, పంచాయతీ ఈఓ పీఎన్‌పీ ఆనందభూషణం 2025 జనవరి 18 నుంచి 2025 మే 12 వరకు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారులు కేవలం ఒక నెల రికార్డులు మాత్రమే పరిశీలించారని, అన్ని నెలల రికార్డుల పరిశీలన చేయాలని తాజాగా కోరారు. దీంతో సెప్టెంబరు 2న ఉదయం 11 గంటలకు ఏలూరు డీపీఓ కార్యాలయం వద్ద విచారణ చేయనున్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడు చక్కా మురళీకి అధారాలతో రావాలని నోటీసు అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement