భీమవరం: స్థానిక అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీల వివరాలను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ తెలిపారు. ఈ పోటీలకు 96 మంది క్రీడాకారులు పాల్గొనగా తాడి సాయివెంకటేష్ (కోనసీమజిల్లా) ప్రథమ, యర్రంశెట్టి లీలాకృష్ణ (ఎన్‌టీఆర్ జిల్లా) ద్వితీయ, నీలి కుష్పంత్(పశ్చిమగోదావరి), తృతీయ, కుడిపూడి తేజస్ (కోనసీమ జిల్లా), నాల్గవ, టి ప్రసన్నకుమారి (కృష్ణాజిల్లా) ఐదవ స్థానంలో నిలిచారు. విజేతలకు జ్ఞాపికలు, చెస్ బుక్‌లు అందజేశారు. జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట హరిబాబు, సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళీ పాల్గొన్నారు.


