తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.


