భీమవరం: కూటమి ప్రభుత్వం బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా వైఎస్సార్ సీపీలోని బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధిస్తుందని, దానిలో భాగంగానే బీసీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావును అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల అన్నారు. మంగళవారం భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ బీసీ నాయకులు ఎదుగుదల చూడలేక , కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రశ్నిస్తున్న నాయకుల అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు. కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడమేగాక చివరకు అరెస్ట్ చేసి జైలుకు పంపే వరకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపర్చారని ఉమాబాల ధ్వజమెత్తారు. అక్రమ కేసుల నుంచి నాగేశ్వరరావు ఆయన తనయుడు క్లీన్‌చీట్‌తో బయటికి వస్తారని అన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి బీసీ వర్గాల నుంచి సరైన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.


