జాతీయ క్రీడా దినోత్సవం బ్రోచర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జాతీయ క్రీడా దినోత్సవం బ్రోచర్‌ ఆవిష్కరణ

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

జాతీయ క్రీడా దినోత్సవం బ్రోచర్‌ ఆవిష్కరణ చికిత్స పొందుతూ యువకుడి మృతి ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌వైరు చోరీ

భీమవరం: క్రీడా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో భీమవరంలో నిర్వహించనున్న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల బ్రోచర్‌ను మునిసిపల్‌ కమిషనర్‌ కె రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈనెల 27న క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, 28న సెయింట్‌ మేరీస్‌ విద్యార్థులతో 400 అడుగుల జాతీయ జెండాతో క్రీడా ర్యాలీ, 29న క్రీడా దినోత్సవ వేడుకలు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ రాంబాబు, హాకీ కోచ్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శరభాపురానికి చెందిన కొణతం మోహన్‌బాబు(35) ఈనెల 16న రాత్రి 7.30 గంటలకు మోటార్‌ సైకిల్‌పై జంగారెడ్డిగూడెం బయలుదేరాడు. రాత్రి 8 గంటల సమయంలో ద్వారకాతిరుమల బస్టాండ్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న కొట్టువైపు నుంచి మరో బైక్‌ అకస్మాత్తుగా రావడంతో మోహన్‌న్‌బాబు సడన్‌న్‌గా బ్రేక్‌ వేశాడు. దీంతో బైక్‌ అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలవడంతో కుటుంబసభ్యులు 108లో ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మోహన్‌న్‌బాబు మృతి చెందాడు. తండ్రి శ్రీమహావిష్ణు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై టి.సుధీర్‌ తెలిపారు.

దెందులూరు: పెదవేగి మండలం తాళ్లగోకవరం పొలాల్లో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. వ్యవసాయ పొలాల్లో పది వేల రూపాయలకు పైగా ఖరీదు చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితుడు ఆచార్యులు మంగళవారం పెదవేగి పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement