కొనసాగిన మట్టి పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన మట్టి పరీక్షలు

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

కొనసాగిన మట్టి పరీక్షలు 27న జాబ్‌ డ్రైవ్‌ జువైనల్‌ బోర్డు సభ్యుల నియామకం ముదినేపల్లిలో భారీ వర్షం ఉద్యోగి భద్రతకు ప్రాధాన్యమివ్వాలి

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌లోని ఎర్త్‌ కం రాక్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌)లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు సోమవారం కూడా పరీక్షలు నిర్వహించారు. బృందంలో సిద్దార్థ్‌ పీ హెడవూ, శ్రీహరి టి నాయర్‌ , అమిత్‌ సేన్‌ పాల్గొనగా పోలవరం ప్రాజెక్ట్‌ ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఏ గంగాధర్‌, డీజీఎంలు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య, జలవనరుల శాఖ ఈఈ డి.శ్రీనివాస్‌, డీఈఈలు నిర్మల, శ్రీనివాస్‌, శేఖర్‌ బాబు వారికి వివరాలు అందజేశారు. నీరు ప్రవహించే వేగాన్ని కొలిచారు, నేల గట్టిదనం తెలుసుకునే పరీక్షలు చేశారు. కొన్ని నమూనాలు ఇక్కడ ల్యాబ్‌లో, మరికొన్ని ఢిల్లీలో పరిశోధనాలయంలో లోతుగా పరీక్షించి తుది నివేదికలను సిద్ధం చేయనున్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న జాబ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి వి.వరలక్ష్మి ప్రకటనలో తెలిపారు. స్పారో సొల్యూషన్స్‌, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఇంటర్మీడియెట్‌, డిగ్రీ చదువుకున్న పురుషులు, మహిళలు పాల్గొని టెలీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ సేల్స్‌ మేనేజర్‌, సేల్స్‌ మేనేజర్‌, సీనియర్‌ సేల్స్‌ మేనేజర్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. అభ్యర్థులు ఫార్మల్‌ డ్రస్‌ కోడ్‌లో హాజరుకావాలని, మరిన్ని వివరాలు 8886882032, 7416118388 లేదా ఎంప్లాయిమెంట్‌ ఏపీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జువైనల్‌ జస్టిస్‌ బోర్డు మెంబర్లుగా ఏలూరుకు చెందిన ముక్కుడుపల్లి సురేష్‌, కెల్లా హైమావతిని నియమిస్తూ స్టేట్‌ డైరెక్టర్‌ వసంత బాల ఉత్తర్వులు విడుదల చేశారు. బోర్డు మెంబర్లు సోమవారం జిల్లా ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ బి.రచనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు పిల్లలు ఏదైనా నేరం చేస్తే సభ్యులుగా కమిటీ విచారణ చేసి వారికి భద్రత, సంక్షేమం, పునరావాసం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ వారి భవిష్యత్తు కోసం అవసరమైన చర్యలను గుర్తించడంలో సహకరిస్తామన్నారు. పిల్లలకు అవసరమైన కౌన్సెలింగ్‌, విద్య, వృత్తి శిక్షణ, చికిత్స, ఇతర పునరావాస సేవలు అందించే ఏర్పాట్లు చేయడానికి ఆదేశాలు ఇస్తామన్నారు. జిల్లా ప్రొబేషనల్‌ అధికారి కె.జ్యోతి, వెంకటేశ్వరరావు, డి.పద్మ పాల్గొన్నారు.

కై కలూరు: జిల్లాలోని ముదినేపల్లి మండలంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు 6.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దీని తర్వాత కొయ్యలగూడెం 4.8, కలిదిండి 4.4, నిడమర్రు 4.2, పెదపాడు 3.6, ముసునూరు 3.4, ఉంగుటూరు 1.8, నూజివీడు 1.2, మండవల్లి 1.2, కై కలూరు 0.4, పెదవేగి 0.2 మీల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లా మొత్తంగా 33.8 మి.మీ వర్షపాతం కురిస్తే, సాదారణ వర్షపాతం 1.2 మి.మీగా గుర్తించారు. 28 మండలాల్లో 16 మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు.

తాడేపల్లిగూడెం: ప్రతి ఉద్యోగి గౌరవానికి, భద్రతకు ఆయా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాల ని న్యాయవాది బిస్నా చంద్రన్‌ తెలిపారు. ఏపీ నిట్‌లో సోమవారం ఉమెన్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో లైంగిక వేఽధింపుల నిరోధక చట్టంపై బోధన, బోధనేతర సిబ్బందికి అవగాహన క ల్పించారు. ఆమె మాట్లాడుతూ కార్యాలయా ల్లో లైంగిక వేధింపులు మహిళల ఆత్మగౌరవా న్ని దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యకరమైన పని వాతావరణానికి విఘాతం కలిగిస్తాయన్నారు. మహిళా ఉద్యోగులు వేధింపులకు మౌనంగా ఉండకుండా చట్టపరంగా మార్గాలను వినియోగించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement