ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

ముసునూరు : ముసునూరులోని గోర్మేట్‌ పాప్‌ కార్ని కా సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చేయ ని (నాన్‌–జీఎంఓ) మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం విచ్చేశారు. ఆయన కార్ని కా సంస్థను సందర్శించి మొక్కజొన్న వంగడాల అ భివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. విత్తనాల విభాగంతో పాటు పరిశోధనశాలను సందర్శించి, పరిశోధనా కార్యక్రమాలను ఆసక్తిగా పరిశీలించారు. సంస్థ ఎండీ ఎస్‌పీపీ పట్టాభిరామారావు సంస్థ కార్యకలాపాలను వివరించారు.

ఘన స్వాగతం

ముందుగా ముసునూరు చేరుకున్న ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబా బు, మంత్రులు ఎర్రన్నాయుడు, లోకేష్‌, కొలుసు పార్థసారథి, ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

జ్ఞాపిక బహూకరణ

మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ వేదికపై ఉప రా ష్ట్రపతికి సీఎం చంద్రబాబు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ సమేత జ్ఞాపికను అందజేశారు. అనంతరం గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు వీణను బహూకరించారు. అలాగే మంత్రి కొలుసు పార్థసారథి వీణను బహూకరించారు. వీణల తయారీకి నూజివీడు ప్రాంతం ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలు వీణలు తయారు చేస్తాయని చెప్పారు.

గొర్రెల కొనుగోలుకు చెక్కు అందజేత

ఉప రాష్ట్రపతి పర్యటన అనంతరం తిరిగి హెలిప్యాడుకు చేరుకున్న సీఎం చంద్రబాబు బారికేడ్ల వద్ద ప్రజలను పలకరించారు. కృష్ణా జిల్లా డీసీసీబీ బ్యాంకు సహకారంతో రూ.12 కోట్లతో 400 మందికి గొర్రెల కొనుగోలు రుణాల కోసం నమూనా చెక్కు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement