విద్యాశాఖ చర్చలు విజయవంతం | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ చర్చలు విజయవంతం

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రావికంపాడు జెడ్పీ హై స్కూల్‌ హెచ్‌ఎంపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, ఉపాధ్యాయుల భద్రత, ఆత్మగౌరవం, విధి నిర్వహణలో రక్షణ కల్పించాలనే డిమాండ్‌తో ఏలూ రు జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ చర్చల్లో జిల్లా వి ద్యాశాఖ అధికారి సమక్షంలోనే ప్రధానోపాధ్యాయునిపై దాడి జరిగినందున, ఈ ఘటనపై విద్యాశాఖ తరఫునే అధికారికంగా ఫిర్యాదు చేయాలని ఫ్యాప్టో డిమాండ్‌ చేసింది. దీనిపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు రేపటిలోగా విద్యాశాఖ తరఫున ఫిర్యాదు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు తమ విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఎవరైనా దాడికి పాల్పడితే, ఇకపై అలాంటి ఘటనలను ఉపేక్షించకుండా విద్యాశాఖ ద్వారా చర్యలు తీసుకుంటామని డీఈఓ పత్రికా ప్రకటన జారీ చేయడానికి అంగీకరించారు. ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ స్వయంగా తెలియజేస్తామని డీఈఓ హామీ ఇచ్చారు. రావికంపాడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక సమర్పిస్తామని డీఈఓ తెలిపారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ, అధికారులు, ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement