నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసనలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసనలు

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసనలు అర్హత మార్కులు 40 శాతంగా పరిగణించాలి

ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ విషయంలో టీచర్‌ సంఘాల వినతులను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షం నిర్ణయం తీసుకోవడంపై నేటి నుంచి యూటీఎఫ్‌ ఆందోళనలు చేపడుతుంది. మంగళవారం జిల్లా కేంద్రాల్లో నిరసనలు. 26 నుంచి 30 వరకూ మండలాల్లో నిరసన బైక్‌ ర్యాలీలు, సెప్టెంబరు 3న చలో విజయవాడ. అప్పటికీ విద్యాశాఖ మంత్రి స్పందించకపోతే 4వ తేదీ నుంచి విజయవాడలో రాష్ట్రస్థాయి నిరవరిధిక దీక్షలు చేపడతాం.

–బొర్రా గోపీమూర్తి, టీచర్‌ ఎమ్మెల్సీ

ఇన్‌సర్వీస్‌ వారికి ప్రత్యేక టెట్‌ నిర్వహణను స్వాగతిస్తున్నాం. కానీ, ఈ స్పెషల్‌ టెట్‌లో అర్హత మార్కుల్లో ఎటువంటి మార్పులు లేకపోవడం దారుణం. ఎస్టీయూ తరఫున ఇన్‌సర్వీస్‌ టీచర్లకు అర్హత మార్కులు 40 శాతంగా పరిగణించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. 30 ఏళ్లుగా లెక్కలు చెబుతున్న సబ్జెక్ట్‌ టీచర్‌, ఈ 150 మార్కుల టెట్‌ పరీక్షలో ఇప్పుడు కేవలం 20 మార్కులకే లెక్కలు ఎదుర్కొని, మిగిలిన 130 మార్కులకు తెలుగు, ఇంగ్లీషు, ఫిజిక్స్‌, బయోసైన్స్‌, మెథడాలజీ సబ్జెక్టులు ఏవిధంగా రాయగలరు?

– లంకలపల్లి సాయి శ్రీనివాస్‌, ఫ్యాప్టో చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement