వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయి. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేయించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, అసలు లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి చర్యలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు.
– కంభం విజయరాజు,
చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి
బీసీలు రాజకీయంగా ఎదగకుండా వెన్నుపోటు పార్టీ చేపట్టిన చర్యగా కారుమూరి అరెస్ట్ కనిపిస్తోంది. లేని మద్యం కేసు సృష్టించి గతంలో కారుమూరి సునీల్‌ను, ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని నియంత్రించారు.
– వడ్డి రఘురామ్,
తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి


