కక్ష సాధింపు తగదు | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు తగదు

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

కక్ష సాధింపు తగదు అరెస్ట్‌ అన్యాయం దుర్మార్గపు చర్య

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబంపై ప్రభుత్వం కక్ష సాధింపు తగదు. ఇది బీసీలను అణగదొక్కడానికి జరుగుతున్న చర్యగా భావిస్తున్నాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగాయి. కారుమూరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు మానాలి.

– దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌),

వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు

అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడం అన్యాయం. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు. టీడీపీ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి, అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదు.

– మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు,

నూజివీడు మాజీ ఎమ్మెల్యే

బీసీ వర్గానికి చెందిన కారుమూరిని అక్రమ కేసులో అరెస్టు చేయడం కూటమి దుర్మార్గపు చర్యగా భావించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి రాజకీయంగా బలమీన వర్గాలను అణగదొక్కాలనే ఉద్దేశంతో వేధింపులు, దాడులకు దిగుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కారుమూరి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.

– నౌడు వెంకటరమణ,

వైఎస్సార్‌సీపీ స్టేట్‌ బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement