ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయాన్ని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఉదయం సందర్శించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు, చింతలపూడి నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలు మామిళ్లపల్లి జయప్రకాష్(జేపీ), కంభంపాటి విజయరాజు తదితరులు సుబ్బారెడ్డికి దుశ్శాలువా కప్పి, పూల బొకేను అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, నల్లజర్ల సొసైటీ మాజీ చైర్మన్ కారుమంచి రమేష్, జంగా కృష్ణారెడ్డి, గోపా నాగేశ్వరరావు, యాచమనేని నాగేశ్వరరావు, మల్లెపూడి నాగమణి, అచ్యుత ఏసుబాబు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, మానుకొండ సుబ్బారావు, మానుకొండ కన్నయ్య, షేక్ భాష, బిరుదుగడ్ల బజారయ్య, గుర్రాల లక్ష్మణ్, కస్సే గంగరాజు, రాచగర్ల కృష్ణ, అన్సారి, అందుగుల రమేష్, మనెల్లి నాగరాజు, మానుకొండ పద్మారావు, పెద్దిన దిలీప్ ఉన్నారు.


