ఏలూరు టౌన్: ఏలూరు పవర్‌పేట వినాయకుడి గుడి రోడ్డులో ఒక వ్యక్తి డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో టూటౌన్ ఎస్సై మధురాజా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు పెదవేగి మండలం భోగాపురం గ్రామానికి చెందిన సర్వేశ్వరరావుగా గుర్తించారు. అతడు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడు ఏలూరు నగరానికి పని నిమిత్తం వచ్చి వెళుతూ, ఆ సమయంలో మద్యం సేవించి ఉండటంతో ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెదవేగి: రాట్నాలకుంటలోని శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి రూ.1,01,727 ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నల్లూరి సతీష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ విడుదల సత్యనారాయణ తెలిపారు.


