పెనుగొండ: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి దంపతులు శుక్రవారం పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయాన్ని, అఖిల భారత వాసవీ పె నుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంను సందర్శించారు. మూలవిరాట్ వాసవీ మా తకు, నగరేశ్వరునికి, మహిషాసురమర్ధనీకి పూజ లు, అభిషేకాలు నిర్వహించారు. వాసవీ శాంతి థాంలో 102 అడుగుల రుషీ గోత్ర మందిరంలోని 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని దర్శించుకుని, మరకత శిల వాసవీ మాతకు పూజలు నిర్వహించారు. పండితులు ఆలయ మర్యాదలతో వేదాశ్వీరచనం అందించారు.


